GasLeak Safety Tips: ప్రస్తుత కాలంలో గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటిలోను మనకు వంట కోసం గ్యాస్ సిలిండర్లను విరివిగా ఉపయోగిస్తున్నాము. అయితే వంట కోసం గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న సమయంలో మనం ఎన్నో భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సిలిండర్ విషయంలో ఏమాత్రం అప్రమత్తమైన భారీ నష్టాలను ఎదుర్కోవాలి. ఇలా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కొన్ని సార్లు కొన్ని కారణాల వల్ల గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది.ఈ విధంగా గ్యాస్ లీక్ అయితే భయపడకుండా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ ప్రమాదం నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
గ్యాస్ లీక్ అవుతున్న సమయంలో ఇంట్లో కిటికీలు తలుపులు తెరిచి పెట్టాలి. పొరపాటున కూడా ఎలక్ట్రిక్ వస్తువులకు దూరంగా ఉండాలి వాటిని తాకకూడదు. ఇకపోతే ఒకవేళ గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు కనుక ఏర్పడితే భయపడకుండా మందపాటి రగ్గును నీటిలో తడిపి వెంటనే సిలిండర్ పై వేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అదుపు చేయవచ్చు.