Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Suma Kanakala: సుమ జయమ్మ పంచాయతీ పెట్టేది ఆరోజే… విడుదల తేదీ ఫిక్స్!

Suma Kanakala: బుల్లితెర వ్యాఖ్యాత ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమా ఈవెంట్లకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా ఇటు బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్న సుమ ఇది వరకే పలు సినిమాలు, సీరియల్లో కూడా నటించారు.ఇలా కెరియర్ మొదట్లో వెండితెరపై సందడి చేసిన సుమ తాజాగా మరోసారి వెండితెరపై కీలక పాత్రలో నటిస్తూ జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన జయమ్మ పంచాయతీ సినిమాలో సుమ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పల్లెటూరి కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పటికప్పుడు అప్డేట్ లను విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే జయమ్మ పంచాయతీ సినిమాని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 22 వ తేదీ జయమ్మ పంచాయతీ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వీడియో ద్వారా ప్రకటించారు. ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ ఈ సినిమాలో నటించారు.

Advertisement
Exit mobile version