Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Kiran abbavaram: లవర్స్ తో సినిమాకు రమ్మంటూ యువ హీరో కామెంట్లు..!

Kiran abbavaram: ఎస్ఆర్ కల్యాణ మండపం ఫేం హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తున్న చిత్రం సమ్మతమే…. సినిమాపై షాకింగ్ కామెంట్లు చేశడు. కలర్ ఫొటో సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. గోపినాథ్ రెడ్డి డైరక్ట్ చేస్తు్న ఈ సినిమా అప్ డేట్ ను కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. అయితే కాంట్రవర్సీలు వద్దు… మనం తీసేది క్యూట్ లవ్ స్టోరీ… సినిమాలో మంచి కంటెంట్ ఉంటది. 15వ తేదీన ట్రైలర్ వదులుతాం. 20న కానీ 22న కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటది ఎంజాయ్ చేయండి. ఊ గ్యాప్ లో మీకు రోజుకో ప్రోమే వదులుతాం. హ్యాపీగా ఎంజాయ్ చేసి మీ లవర్స్ తో కలిసి సినిమాకు రండి. అంటూ సినిమా అప్ డేట్ గురించి చెప్పాడు.

అయితే ఈ చిత్రాన్ని జూన్ 24వ తేదీన థియేటర్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. కిరన్ అబ్బవరం దీంతో పాటు నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. సెబాస్టియన్ 524 పీసీ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో… తాజా సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. అయితే మరి ఇప్పుడు రాబోతున్న సమ్మతమే చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి రికార్డును నెలకొల్పుతుందో చూడాలి.

Advertisement
Exit mobile version