తమిళ సీరియల్ నటి మహాలక్ష్మి ప్రముఖ తమిళ నిర్మాత అయిన రవీందర్ చంద్రశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే వీరిద్దరి పెళ్లికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

భారీకాయుడు అయిన రవీందర్ ను డబ్బు కోసమే మహాలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకుందంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

వీరిద్దరి పెళ్లికి సంబంధించి ఫొటోలపై షేర్ చేస్తూ భారీ ట్రోల్స్ వచ్చాయి.

మహాలక్ష్మి తనపై ఇంతగా ట్రోల్స్ చేస్తున్న పట్టించుకోకుండా కొత్త జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది.

వాస్తవానికి ఇద్దరిది రెండో పెళ్లి అనే చెప్పాలి. మహాలక్ష్మి రెండో పెళ్లి చేసుకోవడానికి ముందే ఆమెకు ఒక పిల్లాడు ఉన్నాడు.

ఫస్ట్ భర్తతో మహాలక్ష్మి గొడవల కారణంగా విడిపోయారు. మొదటి భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది.

ఆ తర్వాత నిర్మాత రవీందర్ ను మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.