టాలీవుడ్‌లో వరుస విషాదాలు జరుగుతున్నాయి.

తెలుగు సినీపరిశ్రమలో నట దిగ్గజాలు మృతిచెందడంతో దిగ్ర్భాంతికి గురిచేస్తోంది

రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ మృతిచెందారు.

ఇప్పుడు సీనియర్ నటుడు చలపతి రావు హఠాన్మరణం చెందారు

డిసెంబర్ 25న ఆదివారం తెల్లవారుజామున చలపతిరావు గుండెపోటుతో మరణించారు

కుమారుడు రవిబాబు నివాసంలోనే చలపతిరావు తుదిశ్వాస విడిచారు. 

చలపతి రావు మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు

చలపతిరావు హఠాన్మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 

చలపతిరావు కుమారుడు రవిబాబుకు ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడారు. 

చలపతిరావు మరణించారనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామని బాబాయ్ లే అంటూ భావోద్వేగానికి గురయ్యారు.