జిన్నా మూవీ అక్టోబర్ 21న థియేటర్లలోకి  రిలీజ్ అయింది.

మూవీలో మంచు విష్ణు తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

మంచు విష్ణు తనదైన శైలిలో సినిమాలతో కొత్తగా చూపించేందుకు ముందుకు వచ్చాడు.

విష్ణు నటించిన జిన్నా ప్రేక్షకులకు ఆశించిన స్థాయిలో ఉందా? 

థియేటర్లకు వెళ్లి చూడదగిన మూవీనా కాదో తెలియాలంటే ఓసారి రివ్యూలోకి వెళ్లాల్సిందే.

ఈ మూవీ స్టోరీ.. తిరుపతిలో మొదలవుతుంది. 

తిరుపతికి చెందిన జిన్నా ఒక టెంట్ హౌస్ రన్ చేస్తుంటాడు.

జిన్నా ఒక రౌడీ నుంచి కొంత అప్పు తీసుకుంటాడు. గడువు లోగా ఆ అప్పును జిన్నా తీర్చలేడు.