షానీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? నిజంగా డబుల్ ఎలిమినేషన్ ఉందా?

బిగ్ బాస్ సీజన్ 6 తొలివారం నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగుతుంది.

రెండో వారంలో అంతకు మించిన ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. 

తొలి వారమే అభినయ శ్రీ ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఎలిమినేషన్ ఎత్తేయడంతో ఆమె సేవ్ అయిపోయింది.

రెండో వారంలో ఆది రెడ్డి, రోహిత్-మెరీనా, షానీ సాల్మన్, రాజ్, రేవంత్, అభినయ శ్రీ, ఫైమా, గలాటా గీతు.. ఈ ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. 

ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు.. షానీ మాత్రమే ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. 

బిగ్ బాస్ అనవాయితీ ప్రకారం.. ఎవరూ ఎలిమినేట్ అయినా వారి జెర్నీ చూపిస్తారు.. కానీ, షానీ జెర్నీ చూపించలేదు.

బిగ్ బాస్ హౌస్‌లో ఏమైనా జరగొచ్చు.. అదేగానీ నిజమైతే.. షానీ ఎలిమినేట్ కాకుండా సీక్రెట్ రూమ్‌కు పంపి ఉండొచ్చు.. 

సాల్మన్ అభినయశ్రీ ఇద్దరూ ఎలిమినేట్ అంటే.. ఫుటేజీలో ఎక్కువగా కనిపించకపోవడమే కారణమని అంటున్నారు. 

షానీ సీక్రెట్ రూంకు వెళ్లడా? నిజంగా ఎలిమినేట్ అయ్యాడా అనేది తేలాలంటే.. కొద్దిగా ఓపిక పట్టాల్సిందే..