Guppedantha Manasu: గౌతమ్ ప్రవర్తన పై అనుమాన పడుతున్న వసుధార.. దొంగ నాటకాలు ఆడుతున్న దేవయాని..?

vasudhara get emotional in todays guppedantha manasu serial episode
vasudhara get emotional in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి మనం రిషి దగ్గరికి వెళ్లి పోదాం మహేంద్ర అని అంటుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో అంకుల్ ఇక్కడ ఉండొద్దు మనం రిషి దగ్గరికి వెళ్దాం అని అనటంతో వెంటనే మహేంద్ర ఏంటి గౌతం నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తున్నావా అని అనడంతో గౌతమ్, జగతి ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు గౌతమ్ నేను మీకు సలహాలు ఇచ్చే అంతటి వాడిన అంకుల్ అనడంతో మరి ఇదేంటి గౌతం అనడంతో రిషి బాధను చూడలేకపోతున్నాను అంకుల్ అందుకే అలా చెప్పాను అని అంటాడు. అంటే కేవలం మీకు మాత్రమే బాధ ఉందా గౌతం నాకు లేదా జగతీకంటే నీకంటే ఎన్నో రెట్లో బాధను ఈ మహేంద్ర భూషణ్ భరిస్తున్నాడు.

Advertisement

ఇదంతా నేను కావాలని చేయలేదు ఇది నేను ఎందుకు చేస్తున్నాను చెబుతాను వినండి అని చెబుతాడు మహేంద్ర. ప్రస్తుతం రిషి ని దేవయాని వదిన ఏం మాట్లాడించదు. ఇప్పుడు ఏమైనా మాట్లాడిస్తే దేవయాని రిషి దూరమవుతాడేమో అనే భయం ఉంటుంది. ఆవిడ తిక్క కుదురుతుంది అలాగే వసుధార రిషి కూడా ఒక్కటవుతారు అందుకోసమే నేను కష్టమైనా సరే ఈ విధంగా దూరంగా ఉంటున్నాను అని జగతి అంటాడు మహేంద్ర. అప్పుడు జగతి కానీ రిషి చాలా బాధపడుతున్నాడు మహేంద్ర అని అనడంతో తప్పదు జగతి కొన్ని కావాలి అంటే బాధను భరించాల్సిందే అని అంటాడు.

Advertisement

అప్పుడు మహేంద్ర జగతి కొడుక్కి ఎన్ని రోజులు దూరంగా ఉన్నావు ఇప్పుడు దగ్గరైనట్టే దగ్గరే మళ్లీ దూరం అవుతున్నాను అని బాధపడుతున్నావా అంటాడు మహేంద్ర. మీరందరూ ఒకటి ఆలోచించారా నేను జగతి దూరమయ్యేసరికి రిషి కి దగ్గర అయ్యింది అంటే వసుధార రిషి ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. అలాగే తన పంతాన్ని నాకు ఇచ్చిన మాటను కూడా వసు వదిలిపెడుతుంది కదా అని అనడంతో గౌతమ్ జగతి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. మరొకవైపు కాలేజీలో రిషి స్టాప్ తో కలిసి న్యూ అడ్మిషన్స్ అలాగే మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు వాళ్లు జగతి రిషి ల గురించి అడగడంతో వాళ్ళు తప్పకుండా వస్తారు మేడం మనం పని మొదలుపెడదాం అని అంటాడు.

ఆ మాటలు విన్న వసుధార అక్కడినుంచి బాధతో నడుచుకుంటూ వెళ్లి జగతి మేడం వస్తారు అని మీరు ఎంత ఆశపడుతున్నారు రిషి సార్ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఒంటరిగా కూర్చున్న వసుధార జగతిని తలుచుకుని ఆమెకు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మరింత బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు దేవయాని చూశారు కదా ఆ మహేంద్ర జగతిలు, ఇల్లు విడిచి వెళ్లిపోయారు అనడంతో వెంటనే ఫణింద్ర ఏం చేసావు దేవి అని అనడంతో నేనేమీ చేయలేదు అండి వాళ్లే వెళ్లిపోయారు మీరు ఎప్పుడూ నా మీద ఆడి పోసుకుంటారు అంటూ దొంగ నాటకాలు ఆడుతూ దొంగ ఏడుపులు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవయాని.

Advertisement

మరొకవైపు వసు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో గౌతమ్ అక్కడికి వచ్చి ఏంటి వసు ఒంటరిగా కూర్చున్న రిషి ఎక్కడ అనడంతో రిషి సార్ మిషిన్ ఎడ్యుకేషన్ న్యూ అడ్మిషన్స్ పనిలో బిజీ బిజీగా ఉన్నారు సార్. ఈ సమయంలో మహేంద్ర సార్ వాళ్ళు ఉండి ఉంటే సార్లు కాస్త ఒత్తిడి తగ్గేది కదా అని అంటుంది. అప్పుడు గౌతమ్ మహేంద్ర జగతి మేడంలు ఇంకా రారు వసుధర అనడంతో వసుధర ఒక్కసారిగా షాక్ అవుతుంది.

మీరు ఎలా చెప్తున్నారు సార్ అనడంతో నాకు అనిపించింది చెప్పాను అంటాడు గౌతం. నిజం చెప్పండి సార్ మహేంద్ర సార్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనడంతో గౌతం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమో తెలియదు వస ద్వారా కానీ మీరిద్దరూ పెళ్లి విషయం గురించి మాట్లాడుకుని ఒక్కటైతే అప్పుడు వాళ్ళు వస్తారని నాకు అనిపించింది అనటంతో లేదు సార్ అంటూ గౌతమ్ ప్రవర్తన పై అనుమాన పడుతూ ఉంటుంది వసు.

Advertisement