Intinti Gruhalakshmi: ఇంటిని అనసూయ పేరు మీద రాసిచ్చిన తులసి.. సంతోషంలో లాస్య..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి ప్రేమ్ ఇద్దరూ ఆఫీస్ కి వెళ్తారు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్లో అనసూయ కూరగాయలు కొనడానికి వెళ్లగా అక్కడ కొందరు ఆడవాళ్లు తులసిని కూతురు అని చెప్పి నెత్తికెక్కించుకున్నావు ఇప్పుడు ఏం జరిగిందో చూసావా అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే తులసి తన ఇంటి వైపు వెళ్తూ ఉండడంతో అది చూసిన అనసూయ ఆగు ఎక్కడికి వెళ్తున్నావ్ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు అనసూయ ఆశీర్వాదాలు తీసుకోవడానికి తులసి వెళ్ళగా ఆగు నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు అని అంటుంది.

Advertisement

అప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళకి వినిపించే విధంగా అనసూయ గట్టిగా మాట్లాడుతూ ఇదిగో అందరూ వినండి తులసి ఇంటి నుంచి వెళ్లిపోలేదు నేనే గెంటేశాను. మర్యాదలు కట్టుబాట్లు కట్టుబాట్లు లేకుండా ఈవిడ హద్దులు జరుపుకుంటూ పోయింది అంటూ నడిరోడ్డుపైనే అందరి ముందు తులసిని నానా మాటలు అని అవమానిస్తుంది అనసూయ. అప్పుడు తులసి ఎక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి లాస్య వచ్చి ఆగు తులసి అని అంటుంది.

Advertisement

అప్పుడు లాస్య తులసి, సామ్రాట్ ల గురించి నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటుంది. అప్పుడు అసలు విషయంలోకి వస్తాను అని చెప్పి ఈ ఇంటిని నీ ఇష్టపూర్వకంగానే అత్తయ్యగారి పేరు మీద రాయిస్తున్నట్టు డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చాను సంతకం పెట్టు అని అంటుంది లాస్య. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పేపర్లు సామ్రాట్ కి చూపించుకో అని అనగా అనసూయ అవసరం లేదు వీటితో సంబంధం లేనప్పుడు మరి ఈ ఇంటితో తనకి ఏం సంబంధం అని అంటుంది.

అప్పుడు అనసూయ, లాస్య తులసి గురించి తప్పుగా మాట్లాడటంతో ఓపిక నశించిపోయిన తులసి ఆ ఇంటిని వాళ్ల పేరు మీద రాసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్లిన తులసి అనసూయ మాటలు గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఆమె పిఏ పర్మిషన్ లేకుండా లోపలికి రావడంతో అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలియదా అని గట్టిగా అరుస్తుంది.

Advertisement

మేడం నేను మీ పిఏ ని ఈరోజు మనకు కొన్ని పేమెంట్స్ చేయాలి దాని గురించి చెప్పాలని వచ్చాను అనటంతో సరే చెప్పు అని అంటుంది తులసి. అప్పుడు ఆమె డబ్బు గురించి చెబుతూ ఉండగా వెంటనే సీరియస్ అయిన తులసి డబ్బు డబ్బు చనిపోయినప్పుడు ఏమన్నా మూట కట్టుకొని వెళ్తారా అంటూ గట్టిగా మాట్లాడుతూ ఆమెను గెట్ అవుట్ అని అరుస్తుంది. ఇంతలోనే సామ్రాట్ అక్కడికి రావడంతో ఆమెను వెళ్ళిపోమని సైగ చేస్తాడు.

ఆ తర్వాత తులసికి తాగడానికి నీళ్లు ఇస్తాడు. అప్పుడు తులసి గారు ఏం జరిగింది మీరు మొదటిసారి ఆఫీసులో ఇంత కోపంగా కనిపిస్తున్నారు పిఏ ఏమన్న కోపం తెప్పించిందా లేకపోతే స్టాఫ్ ఏమైనా మీకు కోపం తెప్పించే విధంగా ప్రవర్తించారా అని అనగా లేదు సామ్రాట్ గారు మా కుటుంబ సభ్యులు ఈ కోపానికి కారణం అని తులసి జరిగింది మొత్తం వివరిస్తుంది. ఇప్పుడు తులసీ తన బాధను సామ్రాట్ తో పంచుకుంటూ తన అత్తయ్య మాట్లాడిన మాటలు తలుచుకొని ఎమోషనల్ అవుతుంది.

Advertisement

సామ్రాట్ ఎంత ఓదార్చినా కూడా తులసి మాత్రం అనసూయ అన్న మాటలు గుర్తుతెచ్చుకొని మా అత్తయ్యకు నా మీద కృతజ్ఞత అనేది లేదు అని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు అనసూయ ఆ తులసి కనీసం నా వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదు. నేను దాన్ని బ్రతిమలాడి దానికి కాళ్లు పట్టుకొని లోపలికి తీసుకొని వస్తాను అని అనుకుందా. ఒకప్పుడు నేను తప్పు చేస్తే మా అత్తయ్య కాళ్లు పట్టుకొని మరి ఇంట్లోనే ఉండనివ్వమని అడిగేదాన్ని.

కానీ అది మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోవడం మాత్రమే కాకుండా ఇప్పుడు భయం లేకుండా ఆస్తి పేపర్ మీద సైన్ చేసి వెళ్ళిపోతుంది అనగా వెంటనే లాస్య అనసూయని మరింత రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. మరొకవైపు తులసి సామ్రాట్ తో తన బాధను పంచుకుంటూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ సెటైర్లు వేసి తులసిని నవ్విస్తాడు.

Advertisement