Karthika Deepam: హాస్పిటల్ నుంచి వెళ్లిపోయిన దీప.. ఇంద్రుడిపై కోపంతో రగిలిపోతున్న సౌందర్య దంపతులు?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప కార్తీక్ తో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో ఈ నెంబర్ ఎవరిదో కనుక్కొని అక్కడికి వెళ్లి సౌర్య నీ వెతుకుతాను అని అనగా అప్పుడు దీప డాక్టర్ బాబు నేను ఒకటి అడుగుతాను చేస్తారా అని అనగా ఏంటి దీప అనడంతో ఒకవేళ నాకు ఏమైనా అయితే సౌర్యని వెతుకుతారు కదా అనడంతో అలా మాట్లాడకు దీప, నీకేం కాదు అని అంటాడు కార్తీక్. ఒకవేళ జరిగితే సౌర్యని వెతుకుతారు కదా, సౌర్య నిజంగా మీ కూతురే డాక్టర్ బాబు నేను ఉన్నా లేకపోయినా తను మీ బాధ్యత అని అనగా వెంటనే కార్తీక్ తన మనసులో నాకు గతం గుర్తుకు వచ్చింది దీప ఆ శుభవార్తను చెప్పినా నీ గుండె తట్టుకునే స్థితిలో లేదు అందుకే చెప్పడం లేదు అనుకుంటూ ఉంటాడు.

Advertisement

అప్పుడు కార్తీక్ శౌర్య నా బాధ్యత అని ముందే చెప్పాను కదా సౌర్యం ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను అని అంటాడు. అప్పుడు దీప, మోనిత కాల్ చేసి విసిగించలేదా డాక్టర్ బాబు అని అనడంతో వెంటనే కార్తీక్ నీకు బాగా అయ్యేవరకు శౌర్య దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు. అప్పుడు దీపఎమోషనల్ అవుతూ మీకు నిజంగానే ఖచ్చితంగా గుర్తుకు వచ్చుంటే మీరు చూపించే అభిమానంతో పాటు ప్రేమను కూడా పొందే దాన్ని అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడు దీప దుర్గా గురించి అడగడంతో దుర్గని మోనిత అరెస్టు చేయించింది అని చెబితే నువ్వు తట్టుకోలేవు అనుకుంటూ ఉంటాడు కార్తీక్.

Advertisement

మరొకవైపు సౌందర్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో హిమ,ఆనందరావు అక్కడికి వచ్చి వెళ్దాం పద నానమ్మ అని అనగా అప్పుడు రాజమ్మ ఇంకా ఫోన్ చేయలేదు హిమ ఫోన్ చేయగానే వెళ్దాం అని అనడంతో అప్పుడు ఆనందరావు ఫోన్ చేయి ఒకసారి అనగా స్విచాఫ్ రావడంతో నాకు ఏదో డౌట్ గా ఉంది అక్కడికి వెళ్దాం పదండి అని అక్కడికి ముగ్గురు కలిసి బయలుదేరుతారు. మరొకవైపు కార్తీక్ హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ బెడ్ పై దీప లేకపోవడంతో హాస్పటల్ మొత్తం వెతుకుతూ అక్కడున్న వారిని అడుగుతూ దీప కనిపించలేదు అనడంతో ఎక్కడికి వెళ్లావు దీప నీ పరిస్థితి బాగోలేదు అంటూ ఎమోషనల్ అవుతాడు.

ఆ తర్వాత సౌందర్య దంపతులు రాజమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు అన్నంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది సౌందర్య. అప్పుడు ఆ ఇంటి ఆమె చెప్పే మాటలను బట్టి ఆనందరావు ఆ ఇంద్రుడు సామాన్యుడు కాదు బాగానే ప్లాన్లు వేసి సౌర్యని మనకు దక్కకుండా చేయాలని చూస్తున్నాడు అని అంటాడు. అప్పుడు ఆ ఇంటి ఆమెను సౌందర్య బెదిరించినప్పటికీ ఆమె అబద్ధాలు చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత సౌందర్య వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ ఇంటి ఆమె ఇంద్రుడికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పగా నువ్వేం భయపడకు ధైర్యంగా ఉండు వాళ్ళు ఎన్ని సార్లు వచ్చి అడిగినా నువ్వు అదే మాట చెప్పు అని అంటాడు. ఎంతమంది వచ్చినా జ్వాలమ్మను ఇచ్చేది లేదు అనుకుంటాడు ఇంద్రుడు.

Advertisement

మరొకవైపు శౌర్య పిన్ని బాబాయిలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ దీప కోసం వెతుకుతూ ఉంటుంది. దీప కూడా సౌర్య ఫోటోని పట్టుకొని వెతుకుతూ ఉంటుంది. అలా ఇద్దరు ఒకరి తెలియకుండా ఒకరు పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్తుండగా దీపను చూసి ఇంద్రుడు సౌర్య పక్కకు లాక్కొని వెళ్లి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద జ్వాలమ్మ అని అంటాడు. ఆ తర్వాత వంటలక్క రోడ్డు పక్కన పడిపోయి ఉంటుంది.

ఇంతలోనే అదే రోడ్లో ఇంద్రుడు వాళ్ళు ఆటోలో వస్తూ ఉండగా ఆటో డ్రైవర్ దీపను చూసి ఆటో ఆపగా అప్పుడు ఇంద్రుడు దీప ను చూసి షాక్ అవుతాడు. ఒళ్లో పడుకున్నా సౌర్య ఎవరి బాబాయ్ అనడంతో నువ్వు చూడలేవులే అమ్మ చూస్తే భయపడతావు అని సౌర్యకి అబద్ధాలు చెబుతాడు. ఆ తర్వాత ఆటో అతని పోనీవ్వు బాబు అని అంటాడు. మరొకవైపు సౌందర్య దంపతులు మోనిత ఇంద్రుడు ప్లాన్ ల గురించి ఆలోచిస్తూ ఎలా అయినా సౌర్యని పట్టుకోవాలి ఆ ఇంద్రుడు సంగతి చూడాలి అనుకుంటూ ఉంటారు.

Advertisement