Janaki Kalaganaledu serial Oct 19 Today Episode : మల్లిక పై విరుచుకుపడ్డ జ్ఞానాంబ..అఖిల్, విష్ణు మాటలకు షాక్ అయిన జ్ఞానాంబ..?

Rama Chandra and Janaki get emotional in todays janaki kalaganaledu serial episode
Rama Chandra and Janaki get emotional in todays janaki kalaganaledu serial episode

Janaki Kalaganaledu serial Oct 19 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మల్లిక తన మాటలతో విష్ణు ని రెచ్చగొడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో జానకి, మల్లిక అందరూ హాల్లోకి వస్తారు. రామచంద్ర,విష్ణు ని డబ్బులు అడగగా అప్పుడు మల్లిక మీరు బాగా నటిస్తున్నారు మీ డబ్బులు మాత్రం వెనకేసుకోవచ్చు మా డబ్బులను మాత్రం ఇంట్లోకి వాడాలి అని అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ మల్లిక అని అంటారు జానకి రామచంద్ర. అప్పుడు వెన్నెల విష్ణుతో,అన్నయ్య వదిన అన్ని మాట్లాడుతున్నా సరే నువ్వేం మాట్లాడడం లేదు వదినని ఆపు అని అనగా ఏమి ఆపుతారు నిన్నటి వరకు అలాగే అంటున్నారు ఎప్పుడైతే వీడియో చూపించి వీళ్ళ గుర్తు బయటపడ్డాను.

Advertisement
Rama Chandra and Janaki get emotional in todays janaki kalaganaledu serial episode
Rama Chandra and Janaki get emotional in todays janaki kalaganaledu serial episode

అప్పుడు ఆ వీడియోని మల్లిక అందరికీ చూపించేసరికి అందరూ షాక్ అవుతారు. అప్పుడు జానకి ఆ వీడియోలో చూస్తుంది వేరు జరిగింది వేరు అని అనగా వెంటనే అఖిల్ అక్కడ కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది ఇంకా ఏం గుచ్చుకుంటారు వదినా ఉన్నట్లు కనిపిస్తోంది కదా అని అంటాడు. ఇప్పుడు అఖిల్ నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉండగా పూజ గదిలో ఉన్న జ్ఞానాంబ వారి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు విష్ణు, ఇక్కడ చెప్పడానికి ఏమున్నది అన్ని బానే కనిపిస్తున్నాయి కదా.

Advertisement

అప్పుడు విష్ణు కూడా నోటీ కి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా వెంటనే జ్ఞానాంబ ఆపు విష్ణు అని గట్టిగా అరుస్తుంది. మీకు రామ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. వాళ్ల నాన్న ఆరోగ్యం కోసం తన చదువుని ఆపి మరీ అందరి కోసం కష్టపడ్డాడు. ఆ స్వీట్ కొట్టు సంపాదనలో కొంచెం మీకోసం ప్రతి నెల దాస్తున్నాడు. అఖిల్ కోసం తన చదువు మానేసి నిన్ను కాలేజీకి పంపించాడు. ఇన్ని చేసినా రామచంద్రాన్ని మీరు తిడుతున్నారు.

Janaki Kalaganaledu అక్టోబర్ 19 ఎపిసోడ్  గోవిందరాజు, జ్ఞానాంబ ఫ్యామిలీ.. అఖిల్, విష్ణు మాటలకు జ్ఞానాంబ షాక్.. 

ఏం చేశారో మీ ఎవరికీ అవసరం లేదు.తిరిగి వాడినే స్వార్ధం తిడుతున్నావా నిజంగా స్వార్థమే అయితే ప్రతినెలా తన డబ్బులు నాకు ఇచ్చేవాడా అని గట్టిగా మాట్లాడుతుంది జ్ఞానాంబ. ఆ మాటకొస్తే జానకి ఒక కోడలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు చదువుకుంటూ ఇంటి బాధ్యతలను తన భుజాలపై వేసుకొని నడిపిస్తోంది. వెళ్లి నిజంగా జానకికి స్వార్థం ఉంటే ప్రతినెల రామచంద్ర నాకు డబ్బులు ఇచ్చేవాడా అని అడుగుతుంది జ్ఞానాంబ.

Advertisement

దాంతో అందరూ మౌనంగా ఉంటారు. ఏం అఖిల్ ఇందాక జానకిని ఏమన్నావు, మీరు చేస్తే తప్పు జానకి చేస్తే తప్పు కాదు అని అన్నావు కదా తను మీ తప్పుని కప్పిపుచ్చుకొని ఆ నింద తన మీద వేసుకొని మిమ్మల్ని కాపాడింది తనని స్వార్థం అంటున్నావా అని అనగా మల్లిక మధ్యలో ఆపి, మీరు ఇప్పటివరకు మీకు తెలిసిందే చెప్తున్నారు అత్తయ్య గారు. ఇప్పుడు మల్లిక ఇప్పటివరకు మీరు తెలియని ఈ వీడియోలో చూడండి అని జ్ఞానాంబ, గోవిందరాజులకి ఆ వీడియో చూపిస్తుంది మల్లిక.

దీనికా మీరు ఇంత గొడవ చేస్తున్నారు అని జ్ఞానాంబ అసలు విషయం చెప్పబోతూ ఉండగా రామచంద్ర ఆపి వద్దమ్మా నువ్వేం చెప్పాల్సిన పనిలేదు వాళ్ళు వినే పరిస్థితులలో లేరు వదిలే అని అంటాడు. అప్పుడు మల్లిక చేసిన తప్పును కపిపించుకోవడానికి ఎన్ని కారణాలు వెతుక్కుంటున్నారో అని అనగా జ్ఞానాంబ మల్లిక అని గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు మల్లికా అవును అత్తయ్య గారు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మా స్వార్థం మాకు ఉంటుంది.

Advertisement

కదా ఇక ఇంట్లో మేము ఒక్క క్షణం కూడా ఉండమో వేరే కాపురం పెడతాము అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. విష్ణు కూడా అదే మాట అనడంతో జ్ఞానాంబ మరింత షాక్ అవుతుంది. అది కూడా ఇంట్లో పరిస్థితి చూసే మాకు అదే గత్తే పట్టేటట్టు ఉంది మేము వెళ్ళిపోతాము అనడంతో జెస్సి నచ్చ చెప్పడానికి ప్రయత్నించగా జెస్సి మీద అఖిల్ సీరియస్ అవుతాడు. అప్పుడు జానకి మేము నీ పట్ల ప్రేమ శ్రద్ధ తీసుకుంటున్నాం మా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్షమించండి.

ఇంకొకసారి ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అన్న మాటని అనొద్దండి. మీ అందరికీ చేతులు జోడించి మరి అడుగుతున్నాను కావాలంటే మీ అందరికీ నచ్చినట్టుగా నేను రామచంద్ర గారు ఉంటాము అని అంటుంది జానకి. అప్పుడు జ్ఞానాంబ వద్దు జానకీ నువ్వు ఎవరిని బతిమిలాల్సిన పనిలేదు. రేపు విజయదశమి మరునాటి రోజు నుంచి ఎవరి సంపాదన వారిదే ఎవరి కాపురం వాళ్ళదే అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

Advertisement

Read Also : janaki kalaganaledu Oct 18 Today Episode : జానకికి జాగ్రత్తలు చెప్పిన జ్ఞానాంబ..విష్ణుని రెచ్చగొట్టిన మల్లిక..?

Advertisement