Guppedantha Manasu: రిషి,వసుల మధ్య మరింత దూరం.. బాధలో జగతి దంపతులు..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార, రిషి కి నిజం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా కూడా రిసీవ్ వినిపించుకోడు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో రిషి నాకు జరిగింది మొత్తం తెలుసు నువ్వు నాకేం వివరించాల్సిన అవసరం లేదు. నువ్వు గురుదక్షిణ ఇవ్వడం నాకే నచ్చలేదు. నాకు నీ మీద ఉన్న ప్రేమ తగ్గదు అలా అని జగతి మేడం మీద ఉన్న అభిప్రాయం మారదు. నువ్వు నన్ను నన్ను రిషిగానే చూడు జగతి మేడం కొడుకులా చూడొద్దు అని చెప్పి పెళ్లి కార్లో కూర్చుంటాడు రిషి.

Advertisement

ఇక మరొకవైపు ధరణి వంటగదిలో ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వచ్చి నువ్వు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా ధరణి. పాలలో చక్కెర కలిపి ఇంటి కోడళ్ళకి లేకపోతే ముఖ్యమైన వాళ్లకు మాత్రమే ఇస్తారు నువ్వు వసు కీ ఇస్తున్నావు అంటే దాని అర్థం ఏమిటి అని ధరణిపై కోపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జగతి వస్తుంది.

Advertisement

అప్పుడు దేవయాని రాజ్యగతి సమయానికి వచ్చావు నీకు ఇక్కడ ఇద్దరు శిష్యులు తయారయ్యారు అని అంటుంది. ఇక ఈరోజు నుంచి ఇంట్లో ఎవరు ఉండాలో లేదో నేను చెప్పాలి. ముందు నీ స్థానం ఏంటో ఆలోచించుకో ధరణి,తోటి కోడలు ఎలాగా నాకు విలువదు నువ్వు కూడా ఈ మధ్య విలువ ఇవ్వడం లేదు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది దేవయాని.

ఆ తర్వాత రిషి వసుధార కారులో వెళ్తూ ఇళ్ళు వచ్చింది అని దిగుతుండగా అప్పుడు వసు కి సీట్లు బెల్టు తీయడం రాకపోవడంతో రిషి సీట్ బెల్ట్ తీస్తాడు. అప్పుడు వసుధార సాయంత్రం రెస్టారెంట్ కి వస్తారు కదా అని అడగగా, ఇప్పుడు ఆ విషయం గురించి కాదు వసుధర నేను మౌనంగా ఉన్నాను అంటే జరిగిన సంఘటనలకు ఒప్పుకున్నట్టు కాదు కొన్ని విషయంలో నన్ను ప్రభావితం చేయొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Advertisement

మరొకవైపు జగతి దంపతులు జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు మహేంద్ర రిషి ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ప్రతి మహేంద్ర మంచితనం గురించి పొగుడుతూ ఉండగా వెంటనే మహేంద్ర జగతి రిషి నా కొడుకు మాత్రమే కాదు నీ కొడుకు కూడా,ఏమో ఏదో ఒక రోజు రిషి కూడా నిన్ను అమ్మ అని పిలిచే రోజు వస్తుందేమో అని అంటాడు.

అప్పుడు జగతి నాకు అలాంటి ఆశలు ఏవి లేవు మహేంద్ర ఇప్పటికి జరిగింది చాలు అంటుంది. ఈ విషయం వల్ల వసుధార మధ్య భేదాలు వస్తాయేమో అలాగే దేవయాని అక్కయ్య కూడా ఎలా ఈ అవకాశాన్ని వాడుకుంటారు అని భయంగా ఉంది అని అంటుంది జగతి. ఇంతలోనే రిషి కార్ దిగి ఆలోచిస్తూ వస్తుంటాడు. మరొకవైపు వసు కూడా తన గదిలో రిషి ఫోటో చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది.

Advertisement

అలా ఒకడి గురించి ఒకరు ఆలోచిస్తూ ఎవరికి వారు వారితోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి నా బాధ నాకు తెలుసు నేను జగతి మేడంని అమ్మ అని పిలవడం అసంభవం అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత మహేంద్ర సోఫాలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు గౌతమ్ వచ్చి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు. అప్పుడు గౌతమ్ రా రిషి నీ గురించే మాట్లాడుకుంటున్నాం అని అంటాడు.

Advertisement