Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మల్లిక మాటలు నిజమేనని నమ్మిన జ్ఞానాంబ, జానకి ని తీసుకుని ఇంట్లోకి వెళ్లి నిజం చెప్పమని అడుగుతుంది. అయితే జ్ఞానాంబ ఎంత అడిగినా కూడా జానకి నోరు విప్పకుండా మౌనంగా ఉంటుంది. మరొకవైపు బయట దిలీప్ ఫ్యామిలీ వారు, వెన్నెల ఫ్యామిలీ వారు తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో మైరావతి పెళ్ళికొడుకు వారిని కాసేపు బయట ఉండండి పిలుస్తాం అని చెబుతుంది.
ఇక గోవిందరాజు మళ్లీక పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూ ఉంటాడు. మరొకవైపు మల్లిక ఏడుస్తూ ఉంటుంది. కానీ జానకి ఎంతసేపటికి నోరు ఇవ్వకపోవడంతో జ్ఞానాంబ మల్లికా చెప్పిందే నిజమని నమ్ముతుంది. మరోవైపు మైరావతి, రామచంద్ర ను పిలిచి గట్టిగా అరుగుతుంది.ఇక మైరావతి ని చూసి భయపడిన రామచంద్ర అసలు విషయాన్ని బయట పెట్టేస్తాడు.
అసలు విషయం తెలిసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. జ్ఞానాంబ మాత్రం జానకి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మధ్యలో మైరావతి కూడా జానకి పై విరుచుకు పడుతుంది. ఇంతలో జ్ఞానాంబ జానకి ని కొట్టడానికి ప్రయత్నించగా రామచంద్ర అడ్డుపడతాడు. జరిగిన విషయం అంతా వివరిస్తాడు. ఈ పెళ్లి వెనుక జరగబోయే ఉంటే మన వెన్నెల దక్కేది కాదు ఆ చనిపోయి ఉండేది అని అనడంతో అందరు షాక్ అవుతారు.
అప్పుడు జానకి క్షమాపణలు కోరుకుంటుంది. కానీ జ్ఞానాంబ మాత్రం మీరు చేసింది చాలా తప్పు నన్ను చాలా మోసం చేశారు అని అంటుంది. తన అత్తయ్య మైరావతి తో మాట్లాడుతూ జానకి చేసినదానికి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మల్లిక మాత్రం జరిగినదంతా ఆనందంగా చూస్తూ తెగ సంతోష పడుతూ ఉంటుంది.
అప్పుడు మైరావతి జానకి వైపు కోపంగా చూస్తూ నిన్ను ఏమీ అనలేక నాకు నేను శిక్ష వేసుకున్నాను అని అంటుంది. ఇక మరోవైపు జ్ఞానాంబ ఫై గ్రీక్ తల్లిదండ్రులు విరుచుకుపడుతారు. పోలీస్ కేసు పెడతాను అంటూ బెదిరిస్తారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.