Intinti Gruhalaxmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. గా ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమ్ పుట్టినరోజు సందర్భంగా తులసి కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా ప్రేమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నందు ప్రేమగా మాట్లాడుతూ మనుషులకు ఏవిధంగా ప్రేమించాలో తెలిసింది అంటూ మాట్లాడతాడు. అలాగే నా కొడుకు ప్రేమ్ కి నేను ఈరోజు నైట్ 12 గంటలకు విష్ చేస్తాను అని నందు అనగా అప్పుడు తులసి నువ్వు నైట్ విషెస్ చెయ్యొద్దు మేమందరం సర్ప్రైజ్ ప్లాన్ చేశాము అని అంటుంది.
అప్పుడు నందు సరే అని అంటారు. మరొకవైపు ప్రేమ్ తన బర్త్ డే సందర్భంగా ఇంట్లో వాళ్ళు ప్లాన్ చేసిన విషయం తెలియక బాధపడుతూ ఉంటాడు. నైట్ 12 అయినా కూడా ఎవరు విష్ చేయకపోవడంతో ప్రేమ్ విచారణ వ్యక్తం చేస్తాడు. ఇక అప్పుడే తులసి వెనుకవైపు నుంచి వచ్చి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది.
ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ప్రేమ్ కి బర్త్ డే విషెస్ చెబుతాను అని ఎక్స్పెక్ట్ చేస్తాడు కానీ ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా చేసుకుంటూ ఉంటారు. ప్రేమ్ బర్త్ డే గురించి ఎవరికీ తెలియని నట్టుగా ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా ఉంటారు. తులసి అయితే మరీ ఇంత బిజీ గా కనిపిస్తూ అసలు ప్రేమ్ బర్తడే తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది.
అప్పుడు ప్రేమ్ ఎవరు బర్తడే విషెస్ చేయనందుకు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఫ్యామిలీ అందరూ ఒక్కసారిగా లైట్ ఆన్ చేసి బర్త్డే విషెస్ చెబుతారు. ఇల్లంతా ఒక రేంజ్ లో లైట్ తో డెకరేట్ చేసి ఉంటారు. ఇక ఆర్ డెకరేషన్ అంతా చూసి ప్రేమ్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు నందుడు వచ్చి ప్రేమ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతాడు.
ఆ తరువాత ఇంట్లో అందరూ కలిసి ప్రేమ్ కి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతారు. అందరూ ఉన్నా కూడా దివ్య మాత్రం కనిపించదు. ప్రేమ్ ఎంతో ఆనందంగా కేక్ కట్ చేస్తాడు. తరువాత తులసి ప్రేమికుడు గిటార్ ను గిఫ్ట్ గా ఇచ్చి ఈ గిటార్ నీకు లైఫ్ కావాలి, ఒక మంచి సింగర్ కావాలి అని చెబుతుంది. దానికి ప్రేమ్ ఆనందం వ్యక్తం చేస్తూ సరే అమ్మా అంటూ తులసి మాట ఇస్తాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.