...

Divorce for frogs: వర్షం ఆగిపోవాలంటూ కప్పలకు విడాకులు ఇప్పిస్తున్న గ్రామస్థులు..!

Divorce for frogs: కప్పలకు పెళ్లిళ్లు చేస్తే వర్షాలు పడతాయన్న విషయం మన అందరికీ తెలిసిందే. చాలా గ్రామాల్లోని ప్రజలు.. ఆ వరుణ దేవుడు కరుణించాలని కోరుతూ కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ భోపాల్ లోని ఓ గ్రామంలో మాత్రం వర్షం ఆగిపోవాలని కోరుతూ గతంలో పెళ్లి చేసిన కప్పలకు విడాకులు ఇప్పించారు. అయితే ఇది విన్న ప్రతీ ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు. కప్పలకు విడాకులేంటంటూ ముక్కున వెలేస్కుంటున్నారు. అయితే వర్షం పడాలంటూ కప్పలకు పెళ్లిళ్లు చేసే ఆనవాయితీ ఉన్న మన దేశంలో విడాకులు పద్ధతి ఉండడం తప్పేమీ కాదంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే గతంలో పెళ్లి చేసిన రెండు కప్పలను పట్టుకొని ఆడకప్పకు ఓ రకం బట్టలు, మగ కప్పకు మరో రకం బట్టలు వేసి.. పసుపు, కుంకుమలు పెడతారు. కాసేపపటికి వాటికి పెళ్లి చేసినపుడు వాటిని వదిలేసిన చెరువులో కాకుండా వేర్వేరు చెరువుల్లో వదిలేస్తారు. వర్షాలు అధికమై వరదలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్లు కప్పలకు విడాకులు ఇప్పిస్తారట. అయితే ఈ వార్త ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. చాలా మంది ఈ కప్పల విడాకుల విషయం గురించి చర్చిస్తున్నారు.