...

Varsha, Immu : ఓపెన్ గా ఇమ్మూకు ప్రపోజ్ చేసిన వర్ష… కంగ్రాట్స్ చెప్పిన టీమ్ మెంబర్స్!

varsha, immu: జబర్దస్త్ షో ద్వారా ఎన్నెన్నో ఆన్ స్క్రీన్ రొమాంటిక్ జంటలను చూస్తున్నాం. సుధీర్, రష్మీ తర్వాత ఆ రేంజ్ లో కెమిస్ట్రీ వర్కౌట్ అయింది ఇమ్మూ, వర్షల జంటకే. అయితే వీరి ప్రేమాయణం, పెళ్లి గురించి చాలా సార్లు స్టేజీ మీదే మాట్లాడారు. అయితే తాజాగా విడుదలైన జబర్దస్త్ షో ప్రోమో చూస్తుంటే మాత్రం వర్షా, ఇమ్మాన్యూయేల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బుల్లితెర ప్రేమ జంట.. పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు అర్థం అవుతోంది. పరిస్థితులు చూస్తుంటే ఇది తర్వలోనే జరిగేలా ఉంది. ఇలా అనిపించడానికి కారణం వర్ష చెప్పిన ఇమ్మాన్యుయెల్ కి చెప్పిన మాటలే.

అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న వర్ష, నల్లగా ఉన్న ఇమ్మాన్యుయెల్ ప్రేమలో పడడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. అయితే వీరు మధ్య చాలా సార్లు అలకలు, గొడవలు చోచు చేసుకుంటాయి. అయితే ఆ మధ్య వర్షను.. ఇమ్ము లేడీ గెటప్ అన్నందుకు షో నుండి వాక్ అవుట్ చేసింది. ఎన్ని జరిగినా మళ్లీ కలిసిపోతారు. దీంతో వీరిద్దరూ నిజమైన ప్రేమికులే అనే నిర్ధారణకు వచ్చారు అంతా. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో వర్ష… మీ అమ్మకు చెప్పు.. కోడలు వస్తుందని అని అంటూ ఇమ్మూతో చెప్పింది. అంతకు ముందు నా జీవితంలో లక్, సంతోషం ఏదైనా ఉంది అంటే ఇది కేవలం ఇమ్మాన్యుయెల్ అంటూ చెప్పుకొచ్చింది. ఇమ్మాన్యియెల్ అంటే నాకు అంత ఇష్టం అంటూ మనసులోని మాట బయట పెట్టింది.