Viral video: ఇంట్లోని సభ్యులకంటే ఎక్కువ విలువనిచ్చే బంధం ఒక్క స్నేహం మాత్రమే. బంధువుల కూడా ఇవ్వని విలువను దోస్తులకు ఇస్తుంటాం. మరి అలాంటి స్నేహితులను చిన్నప్పటి నుంచే చేస్కుంటాం. పెద్దయ్యాక కూడా ఆ రిలేషన్ ను అలాగే కొనసాగిస్తూ… వీడు నా చెడ్డీ దోస్త్ అంటూ చెప్పుకొని మురిసిపోయే వాళ్లు ఎంతో మంది. అయితే తాజాగా ఇద్దరు చిన్నారుల మధ్య ఉన్న స్నేహ బంధం వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అది చూసిన ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. అదేంటో మనమూ ఓ సారి చూసేద్దాం.
అయితే ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ… ప్రేమను మనం పుట్టిస్తాం.. ద్వేషాన్ని నేర్చుకుంటాం.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అందులో కొందరు చిన్నారులు కుర్చీలపై కూర్చొని ముచ్చటిస్తుంటారు. అందులో చివరగా ఉన్న అబ్బాయికి విపరీతమైన నిద్ర ముంచుకొస్తుండటంతో తూలుతూ ఉంటాడు. అయితే విషయాన్ని గమనించిన పక్కనే మరో బాలుడు తన స్నేహితుడికి భుజాన్ని అందించి సహకరించాడు. అయితే ఇలాంటి ఫ్రెండ్ ఒక్కడున్నా చాలంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అన్ని బంధాల కంటే స్నేహ బంధం గొప్పదని నిరూపించారు ఈ బుడ్డోళ్లు వీడియోను తెగ షేర్ చేసేస్తున్నారు. మీరూ ఓసారి చూసేయండి.
Love is what we are born with. Hate is what we learn.❤️ pic.twitter.com/AmINRJUuqp
Advertisement— Awanish Sharan (@AwanishSharan) June 21, 2022
Advertisement