Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నందు లాస్య లు, సామ్రాట్ పై కోపంతో రగిలిపోతూ ఉంటారు.
రోజు ఎపిసోడ్లో సామ్రాట్ తులసి ప్రెస్మీట్ కి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు హనీ తులసి ఆంటీ పక్కన కూర్చుంటాను అని అనగా సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వద్దు అనటంతో ఏం పర్లేదు అని అంటాడు సామ్రాట్. మరొకవైపు నందు లాస్య వాళ్ళు తులసి వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలోనే సామ్రాట్ వాళ్ళు రావడంతో వాళ్లని చూసి లాస్య రన్నింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది.
ఇక ప్రెస్ వాళ్ళందరూ సామ్రాట్ తో మేము కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాము అని అనటంతో అక్కడే ఉన్న లాస్య ముందు సామ్రాట్ గారిని మాట్లాడనివ్వండి అని అంటుంది. అప్పుడు ప్రెస్ వాళ్ళు మాట్లాడుతూ మొన్న ప్రాజెక్ట్ వద్దనుకున్నారు మళ్ళీ వెళ్ళి తులసి కాల మీద పడ్డారా అనడంతో వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
దీంతో కోప్పడిని తులసి మీరు అడిగే పద్ధతి బాగాలేదు అని అంటుంది. అప్పుడు సామ్రాట్ తులసి గారు మీరు ఆగండి అని అంటాడు. అప్పుడు ప్రెస్ వాళ్లు మరింత రెచ్చిపోతూ మీకు తులసి గారికి మధ్య ఏమైనా సంబంధం ఉందా. మీ వ్యాపార భాగస్వామ్యం కాస్త జీవిత భాగస్వామ్యం అవ్వనుందా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయడంతో తులసికి బాగా కోపం వస్తుంది.
ఇప్పుడు సామ్రాట్ బాధతో మౌనంగా ఉండగా వెంటనే తులసి మాట్లాడుతూ ఎందుకు ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఒంటరి ఆడదాన్ని అయిన నేను కష్టపడుతున్నాను అలాంటి సమయంలో సామ్రాట్ గాడు తోడు నిలిచారు. నేను కష్టపడి పైకి ఎదిగి ఎంతో మందికి ఆదర్శం అవ్వాలి అనుకుంటున్నాను.
అయినా ఎదిగేటప్పుడు ఇటువంటి నిందలను మోయక తప్పదు కాబట్టి ఎవరు ఏమనుకున్నాను మేం పట్టించుకోము. మా మధ్య ఎటువంటి సంబంధం లేదు. అనుకున్న విధంగానే ముందు ఓకే చేసిన ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఇక మీరు ఏం రాసుకోవాలి అనుకున్నారా అది రాసుకోండి అని తెలిసి మీడియాపై ఫైర్ అవుతుంది. దాంతో తులసి కుటుంబ సభ్యులు అందరూ తులసీని మెచ్చుకుంటూ ఉంటారు.
కానీ అవి మాత్రం ఇంత రాద్ధాంతం అవసరమా అంటూ మాట్లాడుతుంటాడు. వెంటనే అనసూయ నా కోడలు తప్పు చేయదు అని అభి నోరు మూయిస్తుంది. అయినా కూడా అభి అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తులసి సమాజం గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత సామ్రాట్ నిద్రపోతున్న నీ దగ్గరికి వెళ్లి నిప్పులాంటి నిజాన్ని నా గుండెల్లో దాచుకొని సమాజం ముందు నీకు నాన్నల నిలబడ్డాను తల్లి అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు.
అయితే ఇలా చేయడం నిన్ను మోసమే అయినప్పటికీ నీ ఆనందం కోసమే ఇదంతా చేస్తున్నాను అని అంటాడు సామ్రాట్. మీ నాన్నను కానీ నాన్నను క్షమించు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు సామ్రాట్.