TS Police SI Hall Ticket 2022 : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు శుభవార్త.. రేపటి నుంచి (జూలై 30) నుంచి ఎస్ఐ ప్రీలిమ్స్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలో 80 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసందే. ఇందులో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలే ఎక్కువగా ఉన్నాయి. 17వేలకు పైగా SI, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కు సంబంధించిన తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) విడుదల చేసింది.

ఆగస్టు 7వ తేదీన SI ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష, జులై 30న కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి వివిధ పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను జులై 30 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చునని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణ పోలీసు అభ్యర్థులు ఈ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పరీక్ష హాల్ టికెట్లు ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంటాయని TSLPRB వెల్లడించింది. పోలీస్ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 6.50 లక్షల మంది, SI ఉద్యోగాలకు సంబంధించి 2.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.