Multibagger: స్టాక్ మార్కెట్ ను చాలా మంది జూదం అంటారు. సరైన అవగాహన లేకుండా అంతర్జాతీయ పరిణామాలు పట్టించుకోకుండా ఎవరో ఏదో స్టాక్ లో పెట్టారని పెడితే లాభాలు, నష్టాలు గాలిలో దీపంలా మారిపోతాయి. ఎటు వైపు గాలి వీస్తే అది అటు వైపుగా వెలుగుతుంది. స్టాక్ మార్కెట్ ను ఓ సైన్స్ లా భావించి అన్ని బేరీజు వేసుకుంటే దాని నుండి లాభాలు గడించవచ్చు. మంచి లాభాలు సంపాదించొచ్చు. ఈక్విటీ మార్కెట్ ఎలా కదులుతుందో అందరూ అంచనా వేయడం తప్ప కచ్చితంగా ఇలాగే వెళ్తుందని మాత్రం ఎవరూ చెప్పలేరు. అందుకే మార్కెట్ లోకి వ్చచే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు.
లాభమైన, నష్టమైనా ప్రతి దానికి సిద్ధంగా ఉండాలని అందరూ చెప్పే మాట. మరొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే.. స్టాక్ మార్కెట్ ను స్వల్ప కాలానికి కాకుండా దీర్ఘకాలానికి లక్ష్యాన్ని పెట్టుకుని పెట్టుబడి పెట్టాలని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. స్టాక్ మార్కెట్ లో వేలాది షేర్లు ఉంటాయి. కొన్ని మాత్రమే మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేర్ కూడా ఒకటి. ఈ షేరు ఒకప్పుడు రూ.1 ఉండేది. ఇప్పుడు రూ.2100 వద్దకు చేరింది. టైర్లను తయారు చేసే ఈ కంపెనీ షేరు ధర బీఎస్ఈలో 2002 జూన్ లో కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉండేది. కానీ జూన్ 24, 2022 నాటికి దాని ధర రూ.2131గా ఉంది. అంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ షేరు ధర 200000 శాతం పరుగులు పెట్టిందని చెప్పాలి.