భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ అరుణ్ లాల్ 60 ఏళ్ల వయసులోనూ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అది కూడా 28 వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఇదేదో బలవంతపు పెళ్లి అనుకునేరు. లేటు వయసులో పుట్టిన ఘాటు ప్రేమతో… ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. బెంగాల్ కు చెందిన బుల్ బుల్ సాహోను అరుణ్ లాల్ మే 2వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. కోల్ కతాలోని పీర్లెస్ ఇన్ లో మే 2వ తేదీ సాయంత్రం 7 గంటలకు వీరి వివాహం జరగనుంది. అయితే ఈ వార్త తెల్సిన వారంతా ముక్కున వేలేస్కుంటున్నారు. లేటు వయసులో పెళ్లేంటంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.
అరుణ్ లాల్ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ జట్టు హెడ్ గా పని చేస్తున్నారు. అయితే అరుణ్ లాల్ మొదటి భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను ఒప్పించి మరీ ఆయ.. బుల్ బుల్ సాహోను పెళ్లి చేస్కుంటున్నట్లు సమాచారం. అయితే మొదటి భార్య ఆరోగ్య పరిస్థితుల కారణంగా.. ఇప్పటికే ఆయన ఆమెకు విడాకులు ఇచ్చారట. కానీ ఆమను చూస్కునే వాళ్లు లేక… ఇతడి వందే ఉంటున్నట్లు తెలుస్తోంది.