...

Virata parvam: విరాట పర్వం సూపర్ అంటూ తమిళ డైరెక్టర్ ట్వీట్..!

Virata parvam: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో విరాట పర్వం ఒకటి. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూన్ 17వ తేదీన రిలీజ్ అయింది. అయితే హిట్టు టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం… నక్సలిజం విత్ ప్రేమక కథా చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అందులోనే 1990లో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన సరళ అనే యువతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా విరాట పర్వం రూపొందింది. అయితే కామ్రేడ్ రవన్న పాత్రలో రామా, సరళ పాత్రలో సాయి పల్లవి కనిపించింది. ఈ చిత్రాలనికి చాలా మంది ప్రశంసలు వస్తున్నాయి.

తాజాగా తమిళ డైరెక్టర్ పీఏ. రంజిత్ సోషల్ మీడియా వేదికగా విరాట పర్వం సినిమాపై ప్రశంసల వర్షం కురించారు. మఈ ముధ్య నేను చూసిని సినిమాల్లో విరాట పర్వం అత్యుత్తమమైంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు ప్రశంసలకు అర్హులు. రానా వంటి స్టార్ హీరో ఇలాంటి పాత్రను అంగీకరించి చేసినందుడు అతడిని ప్రత్యేకంగా అభినందించాల్సిందేనని తెలిపారు. అలాగే సాయి పల్లవి కూడా చాలా అద్భుతంగా నటింటిందంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి మంచి సినిమాను అందించినందుకు డైరెక్టర్ కు, మూవీ టీమ్కు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పారు డైరెక్టర్ రంజిత్.