Supritha comments : సురేఖ వాణి, సుప్రిత.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకు పెద్దగా పరిచచయం అక్కర్లేని పేర్లు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. అయితే తాజాగా సురేఖ వాణి ఆమె కూతురు సుప్రితకు… ఉగ్గు పట్టినంత ఓపికగా బీర్ తాగిస్తున్న వీడియో వైరల్ గా మారింది. మందు ఏమాత్రం కింద పడకుండా కూతురు నోట్లో బీరు సీసా కుక్రింది మహాతల్లి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తల్లీ కూతుళ్లు అంటే మరీ ఇలా కూడా ఉండారా అనేట్టుగా ప్రవర్తిస్తుంటారు సురేఖా వాణి, సుప్రితలు. నవ్వే వాళ్లు నవ్వనీ, ఏడ్చే వాళ్లు ఏడ్వనీ అన్నట్లుగా తన చేయాలనుకున్నది చేసేస్తుంటారు.
పార్టీలు, పబ్ లు, టూర్ లు అంటూ ఎంజాయ్ చేసి ఈ అమ్మా కూతుళ్లు తాజాగా యాంకర్ నిఖిల్ కి ఇంటర్వ్యూ నెక్స్ట్ లెవెల్ అన్నట్లుగానే ఉంది. ఇందులో వీరిద్దరూ మరింత ఓపెన్ అయ్యారు. ఎంతలా అంటే… నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలిరా అని పాట పాడి, రాబోయే వాడిలో ఉండాల్సిన క్వాలిటీస్ ని బయట పెట్టారు. నిఖిల్ తో నాటకాలు.. అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో తల్లీ, కూతుళ్లు తెగ సందడి చేశారు. తమ జీవితాలు తెరిచిన పుస్తకం అన్నట్లుగానే వాళ్ల సీక్రెట్స్ బయటపెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన తల్లికి పెళ్లి చేసే ఉద్దేశం ఉందంటూ వివరించింది. తన తల్లి డేట్ కి వెళ్లాల్సి వస్తే పవన్ కల్యాణ్, నాగార్జునలతో వెళ్తుందని చెప్పి షాక్ కు గురి చేసింది.
Read Also : Swetha basuprasad : వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కయినా ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా..!