Sudigali Sudheer: జబర్దస్త్ లోకి సుధీర్ రీఎంట్రీ.. అతనొక్కడే కాదండి అందరూ వెనక్కి!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది జబర్దస్త్ షోనే. ఎందుకంటే ఆయన కెరియర్ ప్రారంభమైంది, స్టార్ హోదాకు తెచ్చింది ఈ కార్యక్రమమే. అయితే ఇటీవలే ఆయన జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపిస్తూ.. అభిమానులను అలరిస్తున్నాడు. సుధీర్ కోసమే షో చూసే వాళ్లు చాలామంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అతనిడకి ఉన్న ప్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి.

Advertisement

అయితే జబర్దస్త్ షో నుంచి జడ్జిగా తప్పుకున్నప్పటి నుంచి చాలా మంది ఆ షోకు గుడ్ బై చెప్పారు. మంత్రి పదవి వచ్చినందువల్లే రోజూ జబర్దస్త్ కు దూరం కావాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులు కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారు. ఇక యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ నుంచి తప్పుకుందనే వార్తలు వినిపించాయి. సుధీర్ తో కలిసి స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్ షఓ చేస్తుండటంతో జబర్దస్త్ నుంచి అనసూయ వీడిందనే వార్తలు వినిపించాయి.

కిరాక్ ఆర్పీ మల్లెమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. జబర్దస్త్ గుట్టు మొత్తం రోడ్డున పెట్టారు. ప్రొడక్షన్ బాగా లేకపోవడం వల్లే హైపద్ ఆది, అనసూయ, సుధీర్, గెటప్ శ్రీను వంటి వాళ్లంతా షోను వీడిపోయారని కిరాక్ ఆర్పీ తెలిపాడు. ఈ కామెంట్లపై మల్లెమాల నష్టనివారణ చర్యలు చేపట్టింది. వరుస వివాదాల నేపథ్యంతో సుధీర్ తో పాటు మరికొంత మందిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు మల్లెమాల టీం వాళ్లు. ఇందులో భాగంగా హింట్ ఇస్తూ తాజాగా సుధీర్ ఉన్న ప్రోమోను వదిలారు
.

Advertisement