Karthika Deepam july 2 Today Episode : తెలుగు బుల్లితెరపై పసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హిమ, జ్వాలా కు అసలు విషయం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండగా జ్వాలా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న శోభ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శోభ, నిరుపమ్, హిమ ల పెళ్లి గురించి మాట్లాడుతూ వారిద్దరి పెళ్లి జరిగిన తర్వాత రెండు మూడు నెలలకు నాకు నిరుపమ్ పెళ్లి చేస్తాను అని అన్నారు కదా ఆంటీ అంతవరకు బాగానే ఉంది ఒకవేళ పెళ్లి తర్వాత హిమ బతికితే నా అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది.
ఆ మాటలకు స్వప్న, ఏంటి శోభ నువ్వు ఒక డాక్టర్ అయి ఉండి ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది. అప్పుడు శోభ హిమ,నన్ను కాకుండా నిరుపమ్ కి వేరే వాళ్ళను ఇచ్చి పెళ్లి చేయడం వెనుక ఏదో రహస్యం ఉంది అని అనడంతో స్వప్న కూడా ఆలోచనలో పడుతుంది. మరొకవైపు సౌందర్య, ఆనందరావులు జ్వాలా దగ్గరికి వెళుతూ ఉండగా హిమ,జ్వాల కోసం క్యారేజ్ తీసుకుని వెళ్ళమని చెబుతుంది.
అప్పుడు సౌందర్య మాట్లాడుతూ నువ్వేమో దాని మీద అంత ప్రేమ చూపిస్తున్నావు కానీ అది నిన్ను కోప్పడుతోంది అని అనడంతో సౌర్య కోసం నేను ప్రాణాలు అయిన ఇస్తాను నానమ్మ అని అంటుంది హిమ. ఇక వారు సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి స్వప్న వచ్చి వారిని గుచ్చి గుచ్చు ప్రశ్నలు వేయడంతో సౌందర్య ఆనంద్ రావ్ లు టెన్షన్ పడుతూ ఉంటారు.
ఇంతలోనే కరెక్ట్ గా జ్వాలా ఫోన్ చేయడంతో సౌందర్యం మరింత టెన్షన్ పడుతుంది. అప్పుడు స్వప్న నాకు తెలియకుండా మీరు ఏదో నా దగ్గర దాస్తున్నారు అని అనడంతో వారి ముగ్గురు షాక్ అవుతారు. ఆ సౌందర్య వాళ్లు జ్వాలా దగ్గరికి వెళ్తారు. మరొకవైపు నిరుపమ్ పెళ్లి పత్రిక చూస్తూ ఆనందంగా ఉంటాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World