Shankar Ram Charan : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త మూవీకి సంబంధించి ఫొటో లీక్ అయింది. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ మూవీ చెర్రీ రాజకీయనేతగా కనిపించనున్నాడు. తెల్ల చొక్కా, పంచ ధరించి సైకిల్ పై చెర్రీ వెళ్తున్న ఫస్ట్ లుక్ లీక్ అయింది. సోషల్ మీడియాలో ఇదే ఫొటో వైరల్ అవుతోంది.
ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. శంకర్ తో చేయబోయే మూవీలో చెర్రీ జాయిన్ కాబోతున్నాడు. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ శంకర్ కొత్త మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లీకైంది. గోదావరి ఒడ్డున తెల్ల చొక్కా, ధోతీ కట్టుకుని చేతులు మడతెట్టిన చెర్రీ.. సైకిల్ తొక్కుతున్న ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆ ఫొటోను చూసిన నెటిజన్లు శంకర్ మూవీలోని స్టిల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఒక తండ్రి పాత్రలో.. రెండోది కొడుకు రోల్ చేస్తున్నట్టు సమాచారం.. 1980 నాటి రాజకీయ నేతగా చరణ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.
మూవీలో ఫ్లాస్ బ్యాక్ స్టోరీకి సంబంధించిన లుక్ అంటున్నారు. ఈ స్టోరీలో కొడుకు ఐఏఎస్ ఆఫీసర్.. తండ్రి రాజకీయాలను అనుసరిస్తూ తాను ఓ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తాడట.. స్టోరీ సంగతి పక్కనపెడితే.. రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఈ ఫొటో చూసి ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. వైరల్ అవుతున్న ఫొటో ఇదే..
Read Also : Anchor Anasuya: మగ జాతి పరువు తీయద్దంటూ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ!