Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నందు, లాస్య,సామ్రాట్ తులసీల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో నందు లాస్య తో ఉద్యోగం మానేస్తాను అని అనగా అప్పుడు లాస్య మనం బయటికి వెళ్తే ఎవడు గడ్డి పీకే ఉద్యోగం కూడా ఇవ్వడు మనం తెచ్చినట్టు ఇక్కడ ఉండాల్సిందే అని అంటుంది. అప్పుడు తులసి విషయంలో నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను నావల్ల కాదు లాస్య అని అంటాడు. ఇప్పుడు లాస్య ఏం కాదు అని అనగా అది కాదు లాస్య చదువురాని తులసి మనకి ఇప్పుడు బాస్ అవుతుంది అని అంటాడు.
వారిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు శృతి అంకిత, ప్రేమ్ ఒక చోట నిలబడి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి అభి వస్తాడు. అప్పుడు అభి నన్ను ఎందుకు పిలిచారు అని అనగా అప్పుడు ప్రేమ్ అమ్మ మన బలవంతం మీద ఈ పని చేయడానికి ఒప్పుకుంది. కాబట్టి అమ్మను ఎవరు ఏమీ అనకూడదు అనడంతో. అప్పుడు అభి నేను అంత చెడ్డవాడిలా కనిపిస్తున్నానా అని అంటూనే మళ్లీ నందు గురించి మాట్లాడుతూ ఉంటాడు.
అప్పుడు ప్రేమ్ ఈ విషయంలో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నా అభిప్రాయాన్ని మార్చడానికి చూడవద్దు అభి అని అక్కడి నుంచి శృతిని తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత హనీకి తులసి భోజనం తినిపిస్తూ ఉండగా ఇంతలో తులసి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి మాకు కూడా తినిపించాలి అని అంటారు. అప్పుడు తులసి సరే అని అందరికీ గోరుముద్దలు పెడుతూ ఉంటుంది.
ఇక ఇంతలో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు అది చూసి ఆనంద పడుతూ ఉంటారు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి హనీకి చెక్ చేసి వెళ్ళగా ఇప్పుడు నాకు బాగానే ఉంది హ్యాండ్ రైజింగ్ ఆడదామా అనటంతో అందరూ నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత సామ్రాట్ అక్కడికి వచ్చి తులసి తో మనం ఆగిపోయిన పనిని మళ్ళీ పూర్తి చేద్దాము మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్ట్ను తిరిగి మొదలుపెడదాం.
ప్రెస్ మీట్ పెట్టి అందరికి చెబుదాము అనగా అప్పుడు తులసి వద్దు అనడంతో నందు తులసి కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతాడు. అప్పుడు లాస్య ఏంటి నందు నువ్వు కూడా తులసి లాగే ఆలోచిస్తున్నావు అంటుంది. ఇంతలోనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఈ విషయమే కాదు తులసి వ్యాపార భాగస్వామి తప్పుకుంది అన్న విషయం మీడియా వాళ్లకు ఎలా తెలిసింది అన్న విషయం గురించి కూడా ఎంక్వైరీ చేయాలి అనడంతో లాస్య అనవసరంగా గెలికీనట్టు ఉన్నానే అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడు అప్పుడు తులసి నిర్ణయం అడగగా ఇప్పుడు దొరికినా కూడా వారిని ఏం చేస్తారు అని అనగా పోలీస్ స్టేషన్లో వేయించి బూతులు లెక్క పెట్టేలా చేస్తాను అనడంతో లాస్య భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు తులసి మాటలకు ఆశ్చర్యపోయిన అభినందిస్తాడు. ఆ తర్వాత ప్రెస్ మీట్ గురించి నందు లాస్యలకు చెప్పడంతో నందు లాస్య సామ్రాట్ ని తిట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత శృతి ప్రేమ్ ఇద్దరూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు.
ఇక రేపటి ఎపిసోడ్ లో అభి,సామ్రాట్ మీద సీరియస్ అవుతూ మా అమ్మ మీతో కలిసి పని చేయదు అని అంటాడు. మీ భార్య ఏమైందో చెప్పండి.. చంపేశారా. లేక చనిపోయిందా. లేదంటే లేచిపోయిందా అంటూ నోటికొచ్చిన విధంగా వాగుతూ ఉంటాడు అభి. దాంతో అభి నీ సామ్రాట్ ఏమీ అనలేక ఏడుస్తూ ఉంటాడు.