Guppedantha Manasu serial Oct 17 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి కోపంతో వసు ని పిలుచుకొని వెళ్తాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఈరోజు మహేంద్ర, జగతి ఇద్దరు జరిగిన విషయం గురించి తెలుసుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు మహేంద్ర రిషి ఫోటో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర అలా ఎలా కొట్టావు జగతి అని అనగా మనం ప్రేమించిన వాళ్లు తప్పు చేస్తే కొట్టాలనిపిస్తుంది మహేంద్ర అని అంటూ వసు,రిషి ల గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతుంది జగతి.
అప్పుడు మహేంద్ర కూడా వసు ఎందుకు ఇలా చేస్తోంది అని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు వసుధార, రిషి ఒకచోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వసు మన మధ్య ఒక చీర, గురుదక్షిణ అడ్డుగా వస్తోందా అని అనగా వెంటనే రిషి నేను నిన్ను అడగాలి అనుకుంటే నువ్వు నన్ను అడుగుతున్నావు అని అంటాడు.
అప్పుడు వసుధర జరిగిన విషయాల గురించి నేనేమీ బాధపడటం లేదు సార్ నన్ను కొట్టే హక్కు మేడం కు ఉంది అని అంటున్నారు. అప్పుడు వసుధార మీరు నాకు ఆకాశమంత ప్రేమను చూపిస్తుంటే ఆ ఆరు గజాల చీర ఎందుకు సార్ అని అంటుంది. అలా వసుధార తన మాటలతో రిషి కన్విన్స్ చేస్తుంది. అప్పుడు వసు ఒక చీర కట్టుకుంటే బంధం పెరగదు అలా అని చీర కట్టుకోకపోతే బంధం తగ్గదు సార్ అని అంటుంది.
Guppedantha Manasu అక్టోబర్ 17 ఎపిసోడ్ : వసు,రూమ్‌కీ వెళ్లిన రిషి..
అప్పుడు వారిద్దరూ కాసేపు ఆ చీర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి వసుధర ఇంత జరిగినా కూడా నువ్వు ఎలా అంత కూల్ గా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఇప్పుడు బస్సు అక్కడ ఏం జరిగిందని బాధపడాలి సర్ అంటుంది. అప్పుడు వసుధార జగతి గురించి మాట్లాడడంతో రిషి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరొకవైపు ధరణి, దేవయాని కి కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు దేవయాని సమాజంలో మంచితనం మానవత్వం అంటూ మాట్లాడుతూ ఉండడంతో ధరణి తన మనసులో దెయ్యాలు మానవత్వం, మంచితనం గురించి మాట్లాడుతున్నట్టు ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వసు గురించి మాట్లాడుతూ గురించి మాట్లాడుతూ చాలా కూల్ గా కొత్త రకంగా మాట్లాడడంతో ధరణి ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది.
ఆ తర్వాత జగతి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారు అన్నీ వచ్చి నాకు చెప్పు అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది. మరొకవైపు వసు ని రిషి ని ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు వసుధార ఇంట్లోకి రమ్మని చెప్పి రిషి కారు కీస్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వసు,రూమ్ కీ వెళ్లిన రిషి వసుధర చేతులు పట్టుకొని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నీ లైఫ్ లో నువ్వు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు వసుధారా అనడంతో జగతి మేడంకి సార్ అని చెబుతుంది వసు. దాంతో రిషి ఒక్కసారిగా బాధపడతాడు. అవును సార్ మీరు నా జీవితం సార్ అనడంతో రిషి ఆశ్చర్యపోతాడు.
Read Also : Guppedantha Manasu serial Oct 15 Today Episode : వసు చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న జగతి.. బాధలో రిషి?