Guppedantha Manasu july 2 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు ఏవీ వీడియోని ప్లే చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుకి ప్రపోజ్ చేసిన వీడియోని సాక్షి అందరి ముందు బయట పెడుతుంది. ఆ వీడియో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవడంతో వెంటనే రిషి, వసుధార అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు సాక్షి,దేవయాని సంతోషంతో లేచి చప్పట్లు కొట్టినట్లు సాక్షి, దేవయాని ఇద్దరు ఊహించుకుంటారు.

rishi-and-his-staff-appreciate-vasudhara-for-her-success-in-todays-guppedantha-manasu-serial-episode
అయితే వారిద్దరూ అలా చేయడంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. ఆ తరువాత వారి దగ్గరికి జగతి వచ్చి వీడియోని పే చేశారని సంతోషపడుతున్నారా అసలైన వీడియో ఇంకా ప్లే కాలేదు అని చెబుతుంది. ఇక గౌతమ్ వసుధార గురించి క్రియేట్ చేసిన వీడియోని ప్లే చేయగా అందులో జగతి,మహేంద్ర, రిషి పుష్ప మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి.
ఆ తర్వాత జగతి,దేవయానికి అసలు ప్లాన్ వివరించడంతో దేవయాని షాక్ అవుతుంది. ఆ తర్వాత రిషి, వసుధార గురించి రెండు మాటలు మాట్లాడి మౌనంగా ఉండగా వెంటనే వసుధార తన విజయం వెనుక రిషి సార్ ఉన్నాడు అని చెబుతుంది. ఆ తర్వాత వసుధారకి పూలదండ వేసి అభినందించగా రిషి వచ్చి కంగ్రాట్స్ అని చెబుతాడు.
అప్పుడు వెంటనే వసు తన మెడలో ఉన్న పూలదండ తీసి రిషి మెడలో వేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత మహేంద్ర ఆ పూల దండను రిషి కార్ లో పెడతాడు. రిషి కారులో వెళుతూ పూలదండ వైపు చూస్తూ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
మరొకవైపు వసుధార రెస్టారెంట్లో కూర్చుని రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన దేవయాని కోప్పడుతూ వసు చేసిన విషయాన్ని తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఎదురుగా ఉన్న ధరణిని కాఫీ తీసుకొని రమ్మని చెప్పడంతో వెంటనే ధరణి దేవయానిపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతుంది.
అంతేకాకుండా ఇల్లు వదిలి పోతున్నాను అంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు ధరణి కూడా ఊహించుకుంటుంది. ఆ తర్వాత జగతి దంపతులు వసుధార దగ్గరికి వెళ్లి ఎందుకు పూలదండ వేశావు అని అడగగా నాకు తెలియకుండా వేసేసాను అని అంటుంది వసు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu July Today Episode : భారీగా కుట్ర పన్నిన సాక్షి దేవయాని.. సాక్షిపై కోపంతో రగిలిపోతున్న జగతి..?