Devatha serial September 10 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ వంట చేస్తూ ఉండగా మాధవ అలాగే చూస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో రాధ వంట చేస్తూ ఉండగా అలాగే చూస్తూ మాధవ ఒక చిన్న ప్లాన్ వేసి తాను కింద పడినట్టుగా యాక్ట్ చేస్తాడు. అప్పుడు వెంటనే రాధా ఇతను ఎలాంటోడైన కానీ ఆపదలో ఉన్నాడు అని సహాయం చేయడానికి వెళుతుంది. అదే అతనుగా భావించిన మాధవ,రాధ పై చెయ్యి వేయడంతో కోప్పడుతుంది. ఆ తర్వాత మాధవ నువ్వు నా పక్కన ఉంటే నాకు ఈ స్టిక్ అవసరం లేదు అంటూ ఆ స్టిక్ ని తీసి రాధకు ఇస్తాడు.

దాంతో రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. నాలో ఏ లోపం లేదు దీని సహాయం అవసరం ఉండేది కానీ ఇప్పుడు అవసరం లేదు అని అంటాడు మాధవ. ఒకవైపు పొలం దగ్గరికి వెళ్లిన జానకి దంపతులు భాగ్యమ్మ తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇంట్లోకి రాగానే మాధవ మళ్ళీ కర్ర పట్టుకొని ఉంటాడు. కానీ రాధ మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.
Devatha serial September 10 Today Episode : మాధవ నిజస్వరూపం తెలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రాధ..?
అప్పుడు మాధవ పిల్లల కోసం ఏమైనా చేసి పెట్టు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరొకవైపు దేవుడమ్మ ఇంట్లో దేవి చిన్మయి ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో దేవి గట్టిగా అరిచి ఇంట్లో ఉన్న అందరిని రమ్మని చెబుతుంది. నన్ను పిలుస్తావు కానీ ఏమీ మాట్లాడమంటే ఏం చేయాలి చిట్టి రాక్షసి అని అడగగా నాతో కలిసి ఆడాలి అని అంటుంది దేవి.
దాంతో దేవుడమ్మ నేను ఆడలేను అని అనడంతో దేవి మాత్రం గట్టిగా మారం చేస్తుంది. దాంతో దేవుడమ్మ సరే అని అంటుంది. ఆ తర్వాత దేవుడమ్మ కళ్ళు మూసుకోవడంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లి దాక్కుంటారు. అప్పుడు దేవుడమ్మ అందరి కోసం వెతుకుతూ ఉంటుంది దేవి చిన్మయి మాత్రం ఒక గదిలో వెళ్లి దాక్కుంటారు. ఇక ఇప్పుడు చిన్మయి కబోర్డ్ లో దాక్కుంటుంది.
ఇక ఆ సమయంలో పైన ఉన్న ఫోటోలు బట్టలు కింద పడిపోయి ఆదిత్య రాధల పెళ్లి ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని చూసిన చిన్మయి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత దేవుడమ్మ దేవిని పట్టుకుంటుంది. మరొకవైపు రాధ ఎమోషనల్ అవుతూ ఉండగా భాగ్యమ్మ ఏం జరిగింది అనడంతో అప్పుడు జరిగింది మొత్తం వివరించి ఇంట్లో ఎవరికోసం ఉండాలి అనుకున్నాను. ఇకపై ఉండను ఇకనుంచి వెళ్ళిపోదాం అనడంతో భాగ్యమ్మ సంతోషపడుతుంది. మరొకవైపు మాధవ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. భాగ్యమ్మ బయటకు వెళ్లి రూమ్ కోసం వెతుకుతూ ఉంటారు. రూమ్ దొరకడంతో అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తారు భాగ్యమ్మ.