Devatha September 9 serial Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామ్మూర్తి కుటుంబ సభ్యులు దేవుడమ్మ కుటుంబ సభ్యులు ఆనందంగా వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో దేవి,చిన్మయి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉండగా అది చూసి దేవుడమ్మ కుటుంబం కూడా సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు రామ్మూర్తి ఇంట్లో పూజ చేసిన రాధ అందరికీ హారతినిస్తూ మాధవకు ఇస్తూ ఉండగా మాధవ కోపంగా చూస్తూ ఉంటాడు.

ఆ తర్వాత రామ్మూర్తి నవధాన్యాలను జానకికి ఇచ్చే ప్రతి వినాయక చవితి రోజున ధాన్యాలను పొలంలో మీ అమ్మ చేత చెల్లిస్తాను అని అంటాడు. మరొకవైపు దేవి ఈ చిన్న రుక్మిణి ని మా ఇంటికి తీసుకెళ్తాను అని అనగా దేవుడమ్మ నువ్వే ఇక్కడ ఉండిపో అని అంటుంది.
అప్పుడు చిన్మయి అలా కాదు నాలుగు రోజులు మా ఇంటికి కూడా వచ్చి ఉండాలి అని అంటుంది. అప్పుడు ఆదిత్య తన మనసులో కొద్ది రోజులకు దేవి ఈ పర్మినెంట్ గా ఇక్కడికే వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు రామ్మూర్తి కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి వెళ్తారు.
Devatha September 9 serial Today Episode : కోపంతో రగిలిపోతున్న భాగ్యమ్మ..?
అక్కడ ఊరి ప్రజలు రాధని పొగుడుతూ మంచి కోడలు అని అంటూ ఉండగా ఆ మాటలు విన్న రామ్మూర్తి కుటుంబ సభ్యులు మాధవ సంతోష పడుతూ ఉంటారు. కానీ రాధా మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రామ్మూర్తి దంపతులు రాధను ఇంటికి వెళ్లి వంటలు చేయమని చెబుతారు.
అప్పుడు భాగ్యమ్మ నేను కూడా వస్తాను అని అనగా మాధవ కోపంగా చూస్తూ నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు. మరొకవైపు దేవి పూజ అయిపోవడంతో అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటుంది. మరొకవైపు రాధా ఒంటరిగా కూరగాయలు కట్ చేస్తూ ఉండగా మాధవ రాధ వైపు అలాగే చూస్తూ ఉంటాడు.
Read Also : Devatha September 8 serial Today Episode : మాధవకు బుద్ధి చెప్పిన భాగ్యమ్మ.. సంతోషంలో దేవుడమ్మ కుటుంబం.?