...

Baby Talent : ఏడాదిన్నరకే ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి.. జ్ఞాపకశక్తి మాత్రం సూపర్

Baby Talent : ఏడాదిన్నర పాపాయి పలికే పలుకులు ముద్దు ముద్దుగా ముచ్చటేస్తాయి. బుడి బుడి అడుగులు వేస్తూ నడుస్తుంటే ముద్దొస్తుంటుంది. కేరళకు చెందిన అలెగ్జాండ్రా అభిలాష్ అనే చిన్నారి మాత్రం అదే వయసులో ప్రముఖులు, కార్డూన్ పాత్రల పేర్లు, ఇంట్లోని వస్తువులను గుర్తు పట్టి వాటి పేర్లను చెబుతూ ఔరా అనిపిస్తోంది. తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకుంది.

ఈ చిన్నారికి పేర్లు గుర్తు పెట్టుకునే లక్షణం ఉందని ఆమె తల్లిదండ్రులకు అనుకోకుండా తెలిసిందట. ఆ చిన్నారిని ఆడించడానికి పక్షులు, జంతువుల బొమ్మలను చూపించి వాటి పేర్లు చెప్పేవారట. ఆ తర్వాత బొమ్మలు, వాటి పేర్లను గుర్తు పెట్టుకుని చెప్పడం మొదలుపెట్టిందట ఆ చిన్నారి. అలా తన బిడ్డలో ఉన్న జ్ఞాపకశక్తిని గుర్తించానని చెబుతున్నారు తల్లి.

Baby Talent
Baby Talent

దాంతో తల్లిదండ్రులు ఆ చిన్నారికి బొమ్మలు, వాటి పేర్లను నేర్పించడం మొదలుపెట్టారు. అలా అలెగ్జాండ్రాకు ఏడాది వయు దాటాక ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల పేర్లు మొదలైనవి నేర్పడం ప్రారంభించారు. ఈ పాప వీడియోలను తీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ పంపించారు. వాటిని గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వాటిని గుర్తించి సర్టిఫికేట్ ఇచ్చారు.

ఇందులో భాగంగా అల్లు ఐదుగురు ప్రముఖుల పేర్లు, వాహనాలు(10), జంతువులు(20), కార్డూన్ పాత్రలు(5), శరీర భాగాల పేర్లు(10), రాజకీయ నాయకులు(5), పక్షులు(15), కూరగాయలు(12), పండ్లు(12), ఆహార పదార్థాలు(15) మొదలైన పేర్లను చిన్నారి అలెగ్జాండ్రా అవలీలగా చెప్పేస్తుంది.

Read Also : KGF 2 Movie Review : ‘కేజీఎఫ్‌’ 2 రివ్యూ : యాక్షన్ డోస్ ఎక్కువైంది…!