TV Actress suicide: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ ఱేఖ ఓజా జూన్ 18వ తేదీ రాత్రి ఆత్మహత్య చేసుకుంది. భువనేశ్వర్ లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు విడిచింది. గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే ఉంటున్న ఆమె.. సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. అందులో తన మరణానికి ఎవరూ కారణం కారని తెలిపింది. అలాగే ఐ లవ్ యూ సాన్ అని రాసుకొచ్చింది.
అయితే 23 ఏళ్ల కల్గి నటి రష్మీ రేఖ గత కొంత కాలంగా సంతోష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నతెలుస్తోంది. రష్మీ మరణానికి సంతోష్ కారణమై ఉండొచ్చని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. శనివారం అంటే జూన్ 18వ తేదీ రష్మీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, తరాత్వ ఆమె చనిపోయినట్లు సంతోష్ తమతో చెప్పాడని వివరించారు. సంతోష్, రష్మీ భార్యాభర్తలుగా నివసిస్తున్నట్లుు ఇంటి యజమాని చెప్పేంత వరకు తమ విషయం తెలియనదని స్పష్టం చేశారు. జగత్ సింగ్ పూర్ జిల్లాకు చెందిన రష్మీ కెమిటి కహిబి కహా అనే ఒడియా సీరియల్ తో గుర్తింపు పొందింది.