Nuvvu Nenu Prema Serial July 26 Today Episode : తెలుగు బుల్లితెర ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.. గత ఎపిసోడ్‌లో భాగంగా విక్కీ వల్ల నానమ్మ పద్మావతి గురించి గొప్పగా చెప్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. శాంతాదేవి వాళ్ల గురించి నీకు ఎంత అని చెప్పిన అర్థం కాదు అని కుంచలకి చెప్తుంది. అప్పుడు కుంచల నాకు కాదు లో క్లాస్ వాళ్ళ సంగతి మీకు అర్థం కావట్లేదు.. అయినా అదే గుడికి మన స్టేటస్ కు తగ్గట్టు రిచ్ గా మాయ కూడా వచ్చింది కదా ఆ సంగతి చెప్పవు ఏంటి అరవింద అంటుంది. అప్పుడు శాంతాదేవి మాయ కూడా వచ్చిందా ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటుంది. అప్పుడు అరవింద అవును అంటుంది. వెంటనే విక్రమ్ ఎందుకు నానమ్మ తను రాకూడదా వస్తే తప్పేంటి అంటాడు.

అప్పుడు అరవింద విక్కీ నువ్వు ఆగు.. నానమ్మ తను కూడా వ్రతం చేస్తాను అంటే నేనే రమ్మన్నాను అంటుంది. వెంటనే కుంచల విక్కీ కోసమే వ్రతం చేసింది తను కూడా ఏమీ తినలేదు పాపం విక్కీ కోసం అంత చేస్తే అలా కాకుండా మీరు అలగాజనాన్ని పొగుడుతారు ఏంటి అంటుంది. అప్పుడు శాంతాదేవి కుంచల వ్రతం చేసినంత మాత్రాన విక్కీ కి భార్య అవుతుందా.. మీకు ఇంతకు ముందే చెప్పాను తనకు ఇంటి కోడలు అయ్యే ఒక్క అర్హత కూడా లేదు మీకు ఇంతకుముందే చెప్పాను అంటుంది. అయినా ఎవరిని ఎలా ముడి వేయాలో ఆపై వాడికి నాకే తెలుసు దీని గురించి ఇంత రాద్ధాంతం చేయొద్దు అంటుంది. అప్పుడు కుంచల గతి లేని వాళ్ళు అంటే ఈవిడకి ఎందుకు అంత ప్రేమ నాకు అర్థం కావట్లేదు నా కర్మ అంటుంది. అప్పుడు మురళి ఏంటి రాణమ్మ మాయా పేరు చెప్పగానే టాపిక్ హీటెక్కి పోయింది అంటాడు. అరవింద చెప్పాను కదా మురళి నానమ్మకి అంటే ఇష్టంలేదు.. ఇంకా విక్కీ మాయా మీద ఉన్నది ప్రేమ, స్నేహం ఏది చెప్పడు అంటుంది. వెంటనే మురళి దీన్ని అడ్డుగా పెట్టుకొని పద్మావతి నీ నా సొంతం చేసుకుంటాను అని మనసులో అనుకుంటాడు.

ఏం టెన్షన్ పడకు రాణమ్మ అంటాడు. ఇకపోతే పద్మావతి అమ్మ నాన్న దగ్గర సంతోషంగా ఉండాల్సిన నేను టెంపరోడి వల్ల ఇలా ఉన్నాను.. ఎలాగైనా టెంపరోడి బారినపడకుండా ఉండాలి అనుకుంటుంది. అప్పుడు అను వచ్చి పద్మావతిని ఏంటి ఇలా ఉంది ఒంట్లో బాలేదా అంటుంది. అప్పుడు పద్మావతి ఏం చేయమంటావ్ ఏం చేస్తున్నా ఆ టెంపర్ వాడే గుర్తొస్తున్నాడు అంటుంది. అప్పుడు అను మర్చిపో వచ్చిన విషయాన్ని ఊరికే గుర్తు తెచ్చుకుంటే నీలో ఉన్న ప్రస్టేషన్ వేరే వాళ్ల మీద చూపించాల్సి వస్తుంది అప్పుడు నీ ఆరోగ్యం పాడవుతుంది..అందుకే ఏం ఆలోచించకు అంటుంది. అప్పుడు పద్మావతి అవునక్కా ఎంత ప్రయత్నించినా నావల్ల కావడం లేదు.. నాకు అమ్మవైన అక్క వైన నువ్వే నన్ను ఈ బారినపడకుండా నువ్వే కాపాడాలి అంటుంది. అప్పుడు అను నిన్ను కాపాడేది ఒక్కడే అంటుంది. వెంటనే పద్మావతి నువ్వు ఆగు టెంపరోడేన అంటుంది.
Nuvvu Nenu Prema Serial : శ్రీనువాసుడి కోసం వికీ ఆఫీసుకు పద్మావతి.. కిందపడబోయిన పద్మావతిని పట్టుకున్న విక్రమాధిత్య

అప్పుడు అను నేను చెప్పేది శ్రీనివాసుడు గురించి నువ్వు బాధ అయినా ఏదైనా ఆ శ్రీనివాసుడికి చెప్తావు కదా. అందుకే ఆ శ్రీనివాసుడి విగ్రహం ఎదురుగా పెట్టుకొని ఆయనకు చెప్పుకో ఆయన తీరుస్తాడు అంటుంది. వెంటనే పద్మావతి మా అక్క బంగారం అవును నాకెందుకు ఈ ఆలోచన రాలేదు ఆయన శ్రీనివాసుడు మన ఇంట్లో లేడు కదా ఆఫీస్ లో ఉన్నాడు పెళ్లి తెచ్చుకుంటాను అంటుంది. ఆర్య అను ఫోటోని చూస్తూ నా మనసులో మాట చెప్పినా అర్థం కావట్లేదు ఒకసారి ఫోన్ చేసి ఐ లవ్ యు టూ అని చెప్పొచ్చు కదా స్వీట్హార్ట్ అంటాడు. వెంటనే కుంచల వచ్చి ఏంటి ఆర్య ఫోన్ చూస్తూ స్వీట్ హార్ట్ అంటున్నావు ఎవరిని అంటుంది. ఆర్య చచ్చాను అమ్మకు అసలే మిడిల్ క్లాసు వాళ్ళంటే పడదు ఇప్పుడు అను నేను లవ్ చేస్తున్నాను విషయం తెలిస్తే అనుకుంటాడు. అప్పుడు కుంచల ఎవరు ఫారన్ లో ఉన్న నీ రిచ్ లవర్ కదా వీడియో కాల్ మాట్లాడుతున్నావా నాకివ్వు అంటుంది.
అప్పుడు ఆర్య లేదమ్మ తన కాల్ చేయలేదు తన కాల్ కోసమే వెయిటింగ్ అంటాడు. అప్పుడు కుంచల తన కాల్ కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి.. మనమే కాల్ చేద్దాం అంటుంది. వెంటనే ఆర్య తన బిజీగా ఉంటుంది చేస్తే నా లవ్ బ్రేక్ అవుతుంది అమ్మా అంటాడు. అప్పుడు కుంచల నీ లవ్ బ్రేకప్ అయితే నా డ్రీమ్ కూడా అవుతుంది వద్దులే..తను కాల్ చేసినప్పుడు నన్ను పిలువు అంటుంది. అప్పుడు ఆర్య ఇలా ఎంతకాలం మేనేజ్ చేయమంటావు స్వీట్ హార్ట్ నువ్వు చెప్తే మీ వాళ్ళతో మాట్లాడతాను అనుకుంటాడు. ఇకపోతే పద్మావతి శ్రీనివాసుని తెచ్చుకోవడానికి వెళుతుంది.

అప్పుడు అను ఇంత పొద్దున్నే అవసరమా అంటుంది. పద్మావతి ఈ రోజు ఆదివారం టెంపరోడి కళ్ళలో పడకుండా ఉండాలంటే ఈ రోజే ఇప్పుడే కరెక్ట్ అంటుంది. పద్మావతి వాళ్ళ అత్త శ్రీరామచంద్ర ఉద్యోగం మానేసిన కూడా ఎందుకు వెళ్తున్నావ్ పోయి ఉడ్చి వస్తావా అంటుంది. అప్పుడు పద్మావతి అర్థం కావట్లేదా అత్త శ్రీనివాసులు తెచ్చుకోడానికి పోతున్నాను అంటుంది. వెంటనే పద్మావతి వాళ్ళ అత్త నిజంగానే నీకు కాళ్లు విరాగకొడతాను లేదంటే మీ నాన్నకు ఫోన్ చేస్తాను అంటుంది. అను కూడా నాకు టెన్షన్ గా ఉంది మీ ఆ టెంపర్ వాడు ఉంటాడేమో అంటుంది. వెంటనే పద్మావతి నువ్వేం టెన్షన్ పడకు ఈ రోజు ఆదివారం ఎవరు ఉండరు ఆ టెంపర్ వాడు కూడా రాడు నేను వెంటనే వెళ్లి వస్తాను అంటుంది.
విక్రమ్ కూడా ఆఫీస్ కి వస్తాడు..సెక్యూరిటీ క్యాబిన్ లో ఉన్న వస్తువులన్నీ తీసేయ్ అంటాడు. అప్పుడు సెక్యూరిటీ ఇది పద్మావతి మేడం ది సర్ అంటాడు. విక్రమ్ అయినా తీసేయ్ అంటాడు. విక్రమ్ మనసులో ఎందుకు ఊరికే తనే గుర్తొస్తుంది అని పద్మావతి గురించి ఆలోచిస్తాడు. ఇకపోతే మురళి శ్రీ పద్మావతి తో సరిగ్గా మాట్లాడలేదని పద్మావతి కాల్ చేస్తాడు. పద్మావతి లిఫ్ట్ చేయకపోతే వాళ్ల అత్తకు చేస్తాడు. పిన్ని పద్మావతి గారు ఎక్కడికెళ్ళింది అంటాడు. పద్మావతి వాళ్లఅత్త ఆఫీస్ కి వెళ్ళింది బాబు అంటుంది.

వెంటనే మురళి వి కూడా ఆఫీస్ కి వెళ్ళాడు కదా అక్కడ ఏం జరుగుతుందో అనుకుంటాడు. అక్కడికి అరవింద వచ్చి ఏంటండీ టెన్షన్ గా ఉన్నారు అంటుంది. అప్పుడు మురళి నేను డీల్ చేస్తున్న కేసుఒకటి ఎక్కడ చేజారి పోతుందని టెన్షన్ గా ఉంది అంటాడు. అప్పుడు అరవింద ఏం టెన్షన్ పడకండి మంచి వాళ్లకి అంతా మంచి జరుగుతుంది అంటుంది. మురళి మనసులో నేను ఆడుతున్న నాటకం బయట పడకుండా చూడాలి అంటాడు. పద్మావతి ఆఫీస్ దగ్గరికి వచ్చి శ్రీనివాస తన కన్ను మళ్లీ అదురుతుంది ఏంటి..అయినా నేను నీ విగ్రహం తీసుకెళ్లడానికి వచ్చాను.. నాకు ఏం జరగకుండా నువ్వే చూడాలి అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం..