Nithin and shalini : టాలీవుడ్ లవబుల్ కపుల్స్ లో నితిన్, షాలిని కూడా ఉంటారు. 2020 జులై 26వ తేదీన పెళ్లి ప్రేమించి పెళ్లి చేస్కున్నారు. అయితే కరోనా సమయంలో ఈ వివాహం జరగటంతో చాలా తక్కువ మంది స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అయితే నితిన్ కంటే కూడా షాలిని సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది.
అయితే తాజాగా తన భర్తతో కలిసి ఉన్న ఒక ఫొటోను పెట్టి… సీ యూ సీన్ అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ పోస్టుకు అర్థం ఏంటో తెలియకపోయినా… అభిమానులంతా ఆమె ప్రెగ్నెంట్ అనుకుంటున్నారు. ఇది నిజమేనా ఉంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు అయితే ఏకంగా కంగ్రాట్స్ చెబుతున్నారు. మొత్తానికి షాలిని మాత్రం ఒక్క పోస్టుతో అందరిలోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. మరి ఆమె చేసిన పోస్టుకు అర్థం ఏంటో తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే.
Read Also : Nayanathara vignesh wedding : నయన్-విఘ్నేష్‌ల పెళ్లి ఆహ్వానం.. వెడ్డింగ్ కార్డు వీడియో వైరల్..!