Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఇంటికి వెళ్లడానికి తులసి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారు..
ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ వల్ల బాబాయ్ సామ్రాట్ దగ్గరికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడగా సామ్రాట్ కోప్పడతాడు. సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు మూడు స్పాయిల్ చేస్తావ్ బాబాయ్ అని తిడతాడు. అప్పుడు సామ్రాట్ వల్ల బాబాయ్ నా బాధ్యతలు ఏంటో నాకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయం లక్కీని తీసుకొని లాస్య దంపతులు సామ్రాట్ ఇంటికి వస్తారు.
అప్పుడు లాస్య వాళ్ళు లోపలికి వెళ్ళలేదా వెంటనే సామ్రాట్ లక్కీని చూసి స్కూల్ కి వెళ్లలేదా అని అనడంతో వెంటనే లాస్య హనీకి హెల్త్ కండిషన్ తగ్గే వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు అనడంతో సామ్రాట్ సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి తులసి రావడంతో హనీ కోసం వస్తున్నారు అని అంటాడు. ఇప్పుడు లాస్య తులసి ఏకంగా కుటుంబం మొత్తాన్ని దింపింది అని నందుతో అంటుంది.
ఇక ఆ తర్వాత అందరూ సంతోషంగా సామ్రాట్ ని పలకరించి హనీ దగ్గరికి వెళ్లి నీకోసమే వచ్చాము నీకు హెల్త్ తగ్గే వరకు ఇక్కడే ఉంటాము అని అనడంతో అని సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ హానితో ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత తులసి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి నందు వస్తాడు.
నువ్వు ఇక్కడి నుంచి నా కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపో అని అనడంతో వెంటనే తులసి మీకెందుకు అన్నట్లుగా మాట్లాడడంతో నందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు నందు అందరి ముందు నన్ను చిన్నచూపు చూసి చెడ్డవాన్ని చేస్తున్నావు అని అనగా తులసి నందుకి తనదైన శైలిలో సమాధానం ఇస్తుంది.
నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అభి అంకితను బయటకు తీసుకుని వచ్చి అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి అమ్మ చేతనే అన్ని పనులు ఆ హాని చేయించుకుంటుంది అని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు అభిని, అంకిత తిడుతూ లాస్యతో పోలుస్తుంది. మరొకవైపు అందరూ కలిసి సరదాగా క్యారం బోర్డ్ ఆడుతూ ఉంటారు.
సామ్రాట్ వాళ్ళు బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడు లాస్య డిస్టర్బ్ అవుతుందేమో అనడంతో నా కూతురు సంతోషం కంటే నాకు ఏది ఎక్కువగా కాదు అని అంటాడు సామ్రాట్. అప్పుడు వెంటనే హనీ సామ్రాట్ ని క్యారం బోర్డ్ ఆడడానికి పిలుస్తుంది. అప్పుడు సరికొత్త ప్లాన్ వేసిన సామ్రాట్ తో సార్ ఈ పక్కనే మేము ఇల్లు తీసుకోవాలి అనుకుంటున్నాము మీకు దగ్గరగా ఉంటుంది అని నందు కూడా చెప్పాడు అని అర్థంతో నందు షాకై లాస్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇదేంటి లాస్య నన్ను ఇలా అడ్డంగా ఇరికించింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు నందు.