Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జానకి నీ గురించి అందరికీ చెప్పేస్తాను అని అంటూ ఉండగా మాధవ బ్రతిమిలాడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్లో జానకి కిందికి వెళుతూ ఉండగా మాధవ అడ్డుపడుతూ ఉంటాడు. అప్పుడు మాధవ ఓపిక నశించిపోయి కోపంతో జానకమ్మను మెట్ల పైనుంచి కిందికి తోసేస్తాడు. అప్పుడు జానకి గట్టిగా అరుస్తూ కింద పడిపోతుంది. అప్పుడు మాధవ ఏం తెలియనట్టుగా జానకి చేతిలో ఉన్న తాళిబొట్టు ఆ లగ్నపత్రిక తీసుకొని జోబులో పెట్టుకుని అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ కిందికి వస్తాడు.
ఇంతలోనే అందరూ అక్కడికి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటారు. జానకిని అలా చూసిన. రామ్మూర్తి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత జానకిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళగా దేవి,చిన్మయి భాగ్యమ్మ దగ్గర ఏడుస్తూ ఉంటారు. రాధా జానకి పరిస్థితి చూసి టెన్షన్ పడుతూ ఉండగా మాధవ మాసం నీకు నాకు మధ్యలో అడ్డు వస్తే మా అమ్మని విడిచి పెట్టలేదు చూసావు కదా అని కోపంగా చూస్తూ ఉంటాడు.
మరొకవైపు ఆదిత్య పడుకుని ఉండగా ఇంతలో రాధ ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో టెన్షన్ పడుతూ వస్తాడు ఆదిత్య. మరొకవైపు పిల్లలు ఇద్దరు నానమ్మకి ఏం కాకూడదు అని దేవుడిని ప్రార్థిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన భాగ్యమ్మ ఏమి అవ్వదు అని ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇంతలోనే హాస్పిటల్ కి ఆదిత్య రావడంతో రామ్మూర్తి, ఆదిత్యని గట్టిగా పట్టుకుని ఏడుస్తాడు.
అప్పుడు మాధవ ఆఫీసర్ నీ అవసరం ఇక్కడ లేదు ఇంటికి వెళ్ళిపో అని అనడంతో వెంటనే రామ్మూర్తి మాధవ పై సీరియస్ అవుతాడు. మరొకవైపు సత్య ఆదిత్య గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. రాధను మరింత అపార్థం చేసుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత జానకమ్మకి మెలుకువ వస్తుంది. అప్పుడు నర్స్ వెళ్లి రాధను అని పిలవగా రాధకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉండగా ఇంతలో మాధవ ఎదురుగా వచ్చి నిలబడడంతో మాధవని చూసి భయపడిన జానకి మరి స్పృహ కోల్పోతుంది. తెల్లారిగానే ఆదిత్య ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆదిత్య అబద్ధం చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సత్య మరింత అపార్థం చేసుకుంటుంది..