...

Viral video: అడవిలో మృగరాజునే భయపెట్టిన పంది.. అట్లుంటది మనతోని అంటున్న అడవి పంది

Viral video: సింహాలు అడవికి రాజులు. అందుకే వాటిని మృగరాజు అని పిలుస్తారు. సింహాలు చాలా శక్తివంతమైనవి అలాగే చాలా ప్రమాదకరమైనవి కూడా. అడవిలో వీడి ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. మిగతా జంతువులు వీటిని చూస్తే భయపడిపోతాయి. జూలు విదుల్చుకుంటూ అడుగులు వేస్తుంటే పై ప్రాణాలు పైకే పోవడం ఖాయం.

పందులు కూడా ప్రమాదకరమైనవే. ముఖ్యంగా మాములు పందులకంటే కూడా అడవి పందులు చాలా వైల్డ్ గా ఉంటాయి. ఇవి చాలా సార్లు అడవులను వదిలి పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తుంటాయి. వీటి బారిన పడే వారి ప్రాణాలు గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఇవీ చాలా కోపంగా ఉంటాయి.

అడవిలో మాత్రం సింహాలు అంటే పందులకు సుస్సు అనే చెప్పాలి. సింహాలను చూస్తే ఇవి పారిపోతాయి. కానీ అలాంటి మృగారాజును సుస్సు పోయించింది ఓ పంది. సింహానికి చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువ షేర్లు అందుకుంటోంది.

ఈ వీడియోలో అడవి పంది సింహంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. సింహం, పంది దాడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. దీనిలో సింహంపై పంది దాడి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో సింహానికి ఏం చేయాలో అర్థం కాక.. వెనక్కి వెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. సింహాన్ని చూడగానే మిగిలిన జంతువులు వెంటనే పారిపోతుండగా… పంది దానితో పోరాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.