Lavanya Tripathi : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ గతకొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ రుమర్లు వచ్చాయి. దీనిపై ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించకపోయే సరికి అదంతా నిజమేనేననే ప్రచారం జోరుగా సాగింది. ప్రైవేట్ పార్టీలో మరోసారి ఇద్దరు కలిసి కనిపించే సరికి అయితే ఈ వార్తలన్నీ నిజమేననే అందరు అనుకున్నారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి.
కామన్ ఫ్రెండ్ బర్త్ డేలో ఇద్దరూ సందడి చేశారు. అయితే ఈ వార్తలపై వరుణ్ తేజ్ స్పందించలేదు. కానీ, లావణ త్రిపాఠి మాత్రం మౌనాన్ని వీడింది. ఇలాగే వదిలిస్తే పెళ్లి కూడా చేసుకున్నారని కూడా అనేస్తారని అనుకుందేమో.. వెంటనే వరుణ్ తేజ్ తో డేటింగ్ అంటూ వస్తున్న గాసిప్ వార్తలకు చెక్ పెట్టేసింది. ఓ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో ఎఫైర్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. వరుణ్ తేజ్‌తో రెండు మూవీల్లో నటించాను. ఒక్క వరుణ్ తేజ్ తోనే కాదు.. చాలామంది హీరోలతో కలిసి నటించాను. అందరితోనూ ఎప్పుడో ఒక పార్టీలో కలుస్తూనే ఉంటాను. వరుణ్ గని మూవీ రిలీజ్ సమయంలో కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ లావణ్య త్రిపాఠి ట్వీట్ చేసింది.
Lavanya Tripathi : నేను సింగిల్.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్మను..
అంతమాత్రానా వారితో ఏదో ఉందంటూ రిలేషన్ అంటకట్టేస్తారా? అంటూ లావణ్య ఫైర్ అయింది. వరుణ్ తేజ్ తో పెళ్లి జరుగబోతుందని, తన కోసం విలువైన డైమండ్ రింగ్ కూడా వరుణ్ గిఫ్ట్ గా ఇచ్చాడంటూ వచ్చిన వార్తలను చూసి నవ్వుకున్నట్టు తెలిపింది. కొంతమంది అయితే వరుణ్‌తో డేటింగ్ చేస్తున్నానంటూ రాయడం చూసి షాకయ్యాను. ప్రస్తుతానికి నేను సింగిల్ మాత్రమే.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నేను నమ్మనని చెప్పేసింది. వరుణ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. మా ఇద్దరి మధ్య మీరు అనుకున్నట్టుగా అలాంటి రిలేషన్ ఏది లేదని తెలిపింది.
ప్రొపెషనల్ పరంగా చాలామంది నటులను కలవడం జరుగుతుందని అంతేతప్పా ఇలాంటివి తాను అసలే పట్టించుకోనని లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది. వరుణ్, లావణ్య ఇద్దరూ మిస్టర్, అంతరిక్షం మూవీలో నటించారు. అప్పటి నుంచే వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారంటూ రూమర్లు వినిపించాయి. ఇప్పుడు లావణ్య త్రిపాఠి రుమర్లకు చెక్ పెడుతూ అసలు విషయం చెప్పేసింది. లావణ్య స్పందించడంతో ఈ రుమర్లకు తెరపడినట్టు అయింది.
Read Also : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మళ్లీ కలిశారుగా.. ఎఫైర్ నిజమేనా?