Telugu NewsLatestNuvvu Nenu Prema Serial : నువ్వు నేను ప్రేమ సీరియల్ - పద్మావతిని అవమానించిన...

Nuvvu Nenu Prema Serial : నువ్వు నేను ప్రేమ సీరియల్ – పద్మావతిని అవమానించిన కుంచల.. భర్త కోసం ఎదురుచూస్తూ అరవింద ఎమోషనల్..!

Nuvvu Nenu Prema Serial July 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా మాయ కూడా గుడికి వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మాయ విక్రమాదిత్య తో మీ అక్క ఏంటి ఇలా చేస్తుంది. అలాంటి లో క్లాస్ వాళ్ళ కాళ్ళు పట్టుకుని పసుపు రాయడం చాలా చీప్ గా ఉంటుంది. అనగానే విక్కీ మా అక్క ఏం చేసినా అది అందరి కోసమే నువ్వు మా అక్క ని ఇలా అని నువ్వు చీప్ అవ్వద్దు అంటాడు. అప్పుడు పద్మావతి నేను కూడా మీ కాళ్ళకి పసుపు రాస్తాను మీలాంటి మంచి వారికి పసుపు రాస్తే మాకు కూడా మంచి జరుగుతుంది అంటూ అరవింద కాళ్ళకి పసుపు రాస్తుంది. అరవింద మాయను పిలిచి మీరు కూడా రండి మీకు కూడా పసుపు రాస్తాను అంటుంది. అప్పుడు మాయ సారీ నాకు ఇలాంటివన్నీ అలర్జీ అంటుంది.

Advertisement
Kuchala insults Padmavathi and Anu in the temple, Aravinda gets emotional for her husband's arrival
Kuchala insults Padmavathi and Anu in the temple, Aravinda gets emotional for her husband’s arrival

అరవింద విక్కీతో ఇంకా బావగారు రాలేదేంటి అనగానే విక్కీ కాల్ చేసి అరవిందకి ఇస్తాడు. అప్పుడు అరవింద ఏంటండీ ఇంకా రాలేదు అనగానే నేను గుడికి దగ్గరలో ఉన్నాను మీరు పూజ స్టార్ట్ చేయండి వస్తాను అంటాడు. గుడిలో అయ్యగారు పూజ చేస్తూ ఈ వ్రతం చేసిన వారంతా తమ కోరికలను మనసులో కోరుకోండి అంటూ అందరికీ హారతి ఇస్తాడు. అప్పుడు విక్కీ మరియు పద్మావతి కలిసి ఒకేసారి హారతి తీసుకుంటారు. అలాగే ఆర్య మరియు అను లు కూడా కలిసి ఒకేసారి హారతి తీసుకుంటారు. అందరూ ఉపవాస దీక్షను విడుస్తారు. ఆర్య అను దగ్గరికి వచ్చి తాగడానికి నీళ్ళు ఇస్తాడు. ఒకవైపు కుంచల మరియు అతని భర్త ఉపవాస దీక్ష ను విడుస్తారు. అలాగే మాయ విక్కీ దగ్గరికి వచ్చి విక్కీ చేతులతో నీళ్లు తాగి ప్రసాదాన్ని తింటుంది. అప్పుడు విక్కీ కోపంతో మాయ నాకు ఇలాంటి పూజలు వ్రతాలు నచ్చవని నీకు తెలుసు కదా మరి ఎందుకిలా చేశావు అనగానే మాయ మనకి త్వరగా పెళ్లి కావాలని ఇలా చేశాను అంటుంది.

Advertisement

Nuvvu Nenu Prema Serial : ఆయన వచ్చేంతవరకు నేను ఏమి తిననన్న అరవింద.. నేను ఏం పాపం చేశాను!

Kuchala insults Padmavathi and Anu in the temple, Aravinda gets emotional for her husband's arrival
Kuchala insults Padmavathi and Anu in the temple, Aravinda gets emotional for her husband’s arrival

ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి మాయ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పద్మావతి, అనులు కూడా వెళ్తున్నాం అని చెప్పడానికి అరవింద దగ్గరికి వస్తారు. అప్పుడు అరవింద కొంచెం సేపు ఆగండి మా ఆయనను పరిచయం చేస్తాను అంటుంది. అప్పుడు కుంచల వాళ్లు ఏమైనా విఐపీలలో క్లాస్ వాళ్ళతో పరిచయం ఏంటి అంటుంది. అప్పుడు పద్మావతి, అనులు అరవిందకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. కుంచల ఇంకా మీ ఆయన కోసం ఎంత సేపు ఎదురు చూస్తావు ప్రసాదం తిను అంటుంది. అప్పుడు అరవింద ఆయన వచ్చేంతవరకు నేను ఏమి తినను అంటుంది. అప్పుడు విక్కీ అక్క నీకేమైనా అయితే నేను తట్టుకోలేను బావగారు వస్తాడులే నువ్వు ప్రసాదం తిను అంటాడు.

Advertisement
Kuchala insults Padmavathi and Anu in the temple, Aravinda gets emotional for her husband's arrival
Kuchala insults Padmavathi and Anu in the temple, Aravinda gets emotional for her husband’s arrival

మీరు ఎన్ని చెప్పిన నేను తినను ఆయన కంటే నాకు ఎవరు ఎక్కువ కాదు అంటుంది. అరవింద కోపంతో దేవుడి దగ్గరికి వెళ్లి నాకు మంచి జీవితం ఇచ్చారు అని ఆనందించే లోపే నాకు ఈ అవిటితనం ఇచ్చారు. కానీ నేను బాధ పడలేదు నాకు నన్ను అర్థం చేసుకునే మంచి భర్త దొరికాడని ఆనందపడ్డాను. నేను ఏం పాపం చేశాను నన్ను ఆయన నీ కలవకుండా చేస్తున్నారు. నా ప్రాణాలు అన్ని ఆయన మీదే పెట్టుకున్నాను. నాలో లోపం ఉన్నట్టు నా పూజలో కూడా లోపం ఉంటే నన్ను శిక్షించండి అంతేకానీ మా ఆయన ను నా దగ్గరికి చేర్చండి అంటూ బాధపడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూద్దాం.

Advertisement

Read Also : Nuvvu Nenu Prema Serial : నువ్వు నేను ప్రేమ సీరియల్.. గుడిలో కళ్లు తిరిగిపడబోయిన పద్మావతి.. పట్టుకున్న విక్రమాధిత్య.. ఉపవాసం చెడగొట్టావంటూ పద్మావతి ఫైర్!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు