Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సౌందర్య ఆనంద్ రావులు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్లో ఆనంద్ రావు, కార్తీక్ దీపలు ప్రాణాలతో లేరా అని అనగా అప్పుడు సౌందర్య ఆ విషయంలో నాకు అనుమానం లేదు ఎందుకంటే నేను శౌర్య కోసం ఇక్కడికి రాకముందే ఆ ఇంద్రుడు సౌర్యను తీసుకుని ఊరు వదిలి వెళ్లాడు అంటే అంతకుముందు ఎవరికో భయపడ్డాడు. అది కార్తీక్,దీప లను చూసి భయపడి ఉంటాడు అని నా అనుమానం అని అంటుంది సౌందర్య. అలా వారు కార్తీక్ దీపల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు దీప హాస్పిటల్ బెడ్ పై ఉండగా దీపను చూసిన కార్తీక్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు.
ఒక క్షణం నువ్వు కనిపించకపోయేసరికి ప్రాణం అయిపోయినట్టు అయింది నువ్వు కనిపించకపోతే నేను ఏమైపోతాను అనుకున్నావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక డాక్టర్ అక్కడికి వచ్చి పలకరిస్తుంది. అప్పుడు కార్తీక్ ఆపరేషన్ చేద్దామా అని అనగా ఇప్పుడు వద్దు డాక్టర్ ఒక టు డేస్ తర్వాత చేద్దాం అని అంటుంది. ఎందుకు డాక్టర్ అని కార్తీక్ అడగడంతో పేషెంట్ కండిషన్ బాగానే ఉంది కానీ మీ కండిషన్ బాగోలేదు అని అనగా అవును డాక్టర్ దీపని ఆ పరిస్థితులలో అలా చూసి నేను తట్టుకోలేకపోయాను అని కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుని ఉండగా ఆ డాక్టర్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ డాక్టర్ అని ఓదార్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు కార్తీక్ దీప చెయ్యి పట్టుకుని ఇప్పటినుంచి నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను దీప నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు మోనిత కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్లి ఉంటాడు. దీప కూడా లేదు ఇద్దరు కలిసి హైదరాబాద్ కి వెళ్ళిపోయారా అని టెన్షన్ పడుతూ హైదరాబాద్ కి వెళ్లడానికి వెళ్లి లగేజ్ సర్దుకుంటుంది. అప్పుడు చివరితకి ఫోన్ చేసి నేను చెప్పే జాగ్రత్తగా విను శివలత నేను హైదరాబాద్ కి వెళ్తున్నాను.
ఈ బోటిక్ అమ్మేయి అని అనగా ఆమె వద్దు మేడం కార్తీక్ సార్ నాలుగు రోజుల్లో తిరిగి వస్తారు మీరు వెళ్లాల్సిన అవసరం లేదు అని అనగా నాలుగు రోజులు కాదు కదా నాలుగు క్షణాలు కూడా ఇంట్లో ఉండలేను అని మోనిత లగేజ్ సర్దుకొని వెళ్తుండగా ఇంతలో అక్కడికి సౌందర్య వస్తుంది. సౌందర్యని చూసిన మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు సౌందర్య మళ్ళీ ఎవరిని చంపడానికి వెళుతున్నావే అని అనగా ఎవరిని లేదు ఆంటీ అనడంతో నోరు ముయ్యి మొన్న నన్ను చంపాలని చూసావు ఇప్పుడు మళ్లీ అబద్ధాలు చెబుతున్నావు అని సీరియస్ అవుతుంది.
నేను నీ ఇంట్లో చూడకూడనిది ఏముంది అంటూ సౌందర్య ఇల్లు మొత్తం వెతకగా ఏమీ కనిపించదు. అప్పుడు అసలు నా దగ్గర ఏం దాస్తున్నావే చెప్పు అని సౌందర్య పదేపదే అడగడంతో మోనిత సౌందర్యని తోసేసి లోపలికి వెళ్లే గడియ పెట్టుకుంటుంది. అప్పుడు సౌందర్య తలుపు తీయి మోనిత అని అనగా లోపలి నుంచి గన్ను తీసుకొని సౌందర్య గురి పెడుతుంది. నా అంతటి నేనేదో నా బతుకు బతుకుతుంటే నన్ను ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారు నేను మీ జీవితాలలోకి ఏమైనా వచ్చానా అంటూ సౌందర్యకి గాని చూపిస్తే బెదిరిస్తూ ఉంటుంది మోనిత.
అప్పుడు అదే అదునుగా భావించిన సౌందర్య అదే గన్ను తీసుకొని మోనితకి గురిపెడుతుంది.. ఇందాక లగేజ్ తీసుకొని ఎక్కడికో వెళ్తున్నావ్ కదా అక్కడికే కదా నేను వస్తాను అని మోనిత వెనకాల వెళ్తుంది. మరొకవైపు శౌర్య బాధపడుతుండగా చంద్రమ్మ అక్కడికి పాలు తీసుకుని వస్తుంది. ఆ తర్వాత ఇంద్రుడు నిద్రపోతూ నిద్రలో దీపని తలుచుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. మరొకవైపు కార్తీక్ డాక్టర్ ఇద్దరు కలిసి దీపకి ట్రీట్మెంట్ చేస్తూ ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.