Devatha Aug 29 Today Episode : తెలుగు బుల్లితెరపి ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మాధవ పై కోపంతో రగిలిపోతున్న రాధ,దేవిని అక్కడినుంచి తీసుకొని వెళుతుంది. ఈరోజు ఎపిసోడ్లో రాధ, ఇంటికి కోపంగా వస్తుంది. అప్పుడు చిన్మయి వచ్చి ఎక్కడికి వెళ్లావమ్మా అని అడగడంతో దేవిని, చిన్మయి తో అయితే వెళ్లి ఆడుకోమని చెబుతుంది. ఆ తర్వాత మాధవ దగ్గరికి వెళ్లి కోపంతో మాట్లాడుతూ ఉంటుంది రాధ. అప్పుడు వెంటనే మాధవ నీ భర్తను చూసావా అనే వెటకారంగా మాట్లాడడంతో రగిలిపోతున్న రాధ వెంటనే మాధవ పై కొట్టడానికి చెయ్యి లేపుతుంది.

Devatha Aug 29 Today Episode
దానితో మాధవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత మాధవ పై గట్టిగా విరుచుకుపడుతూ మాధవకు ఊహించిన విధంగా షాక్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్తుంది రాధ. వైపు దేవి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో చిన్మయి అక్కడికి వచ్చి ఆడుకుందామా దేవి అని అడగగా దేవి రాను అని చెప్పి దూరం పెడుతుంది. దాంతో చిన్మయి బాధపడుతూ ఉంటుంది.
దేవి ప్రవర్తన గమనించిన జానకి కూడా బాధపడుతుంది. మరొకవైపు ఆదిత్య రాధ కోసం ఎదురు చూస్తూ ఉండగా, రాధా అక్కడికి వచ్చి ఆదిత్యను గట్టిగా పట్టుకుని ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ఆదిత్య పెళ్లి ఫోటో చూపించి నేను దేవికి నిజం చెప్పేస్తాను అని అనగా అప్పుడు రాధ ఎమోషనల్ అయ్యి మాధవ చేసిన కుట్ర గురించి చెబుతుంది.
Devatha Aug 29 Today Episode : కోపంతో రగిలిపోతున్న ఆదిత్య..
దాంతో ఆదిత్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వు ఇంటికి వెళ్లి దేవిని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. మరొకవైపు దేవుడమ్మా ఇంట్లో అమెరికా గురించి మాట్లాడుతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య, తాగుబోతు వ్యక్తి కోసం ఎంత వెతికినా కూడా దొరకడు. మరొకవైపు దేవి రాధ ఒకచోట కూర్చుని ఉండగా అప్పుడు దేవి వర్షం పడుతోంది నాన్న ఇంత ఇబ్బంది పడుతున్నాడో, నాన్నను ఇక్కడికి పిలుచుకొని వద్దాము అని అనగా ఇంతలోనే చిన్మయి అక్కడికి వస్తుంది.
అప్పుడు చిన్మయి,దేవి ఎందుకో దిగులుగా ఉంది అనటంతో రాధ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఆదిత్య ఇంటికి వెళ్ళగానే దేవుడమ్మ అమెరికా ప్రయాణం గురించి అడగటంతో ఆదిత్య కోపంతో మాట్లాడడంతో దేవుడమ్మ బాధపడుతూ ఉంటుంది.
Read Also : Devatha: దేవుడమ్మకు మాట ఇచ్చిన దేవి..ఆదిత్యతో మీ ఇంటికి వస్తాను అని చెప్పిన రుక్మిణి..?