Devatha serial September 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవికి కరాటిలో డబుల్ ప్రమోషన్ వచ్చింది అని అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో దేవిని అందరూ పొగుడుతూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు మాధవ కావాలనే నువ్వు నా కూతురు కదమ్మా గెలుస్తావు అని అంటాడు. ఆ మాటకు భాగ్య,రాధ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత దేవుడమ్మ సత్యా ఇద్దరూ ఆదిత్య గురించి మాట్లాడుకుంటూ ఎలా అయినా ఆదిత్య నువ్వే దగ్గర చేసుకోవాలని చెబుతూ ఉంటుంది.
మరొకవైపు చిన్మయి దేవిని తయారు చేస్తూ ఉండగా ఇంతలో రాధ వచ్చి ఏం చేస్తున్నావు చిన్మయి అని అడగగా దేవిని ఆఫీసర్ ఇంటికి పంపుతున్నాను. ఆఫీసర్ వాళ్ళు కూడా మన మనుషులే కదా ఈ శుభవార్తను వాళ్లకు కూడా చెప్పాలి కదా అని అంటుంది. దేవి వాళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే మాధవ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అమ్మా అని అడుగుతారు.
అప్పుడు చిన్మయి దేవిని ఆఫీసర్ ఇంటికి పంపుతున్నాను నాన్న అని అంటుంది. అప్పుడు మాధవ మన ఆనందాన్ని మనతోనే ఉంచుకోవాలి ఇంకొకరు చెప్పడం ఎందుకు అని అనగా అలా ఏం లేదు నాన్న అని చిన్మయి, దేవిని పంపిస్తుంది. అప్పుడు మాధవ సినిమాకి నిజం తెలిసి ఉంటుందా అనే మనసులో అనుకుంటూ ఉంటాడు.
Devatha serial Sep 16 Today Episode : దేవిని చూసిన ఆనందంలో ఆదిత్య..?
మరొకవైపు జానకమ్మ తన భర్త ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. జానకి మాధవలో మార్పు వచ్చింది తేడా వచ్చింది.. రాదని తప్పుడు ఆలోచనతో చూస్తున్నాడు అని చెబుతుంది. అప్పుడు రామ్మూర్తి మన కొడుకు మీద మనకు అనుమానం ఉండకూడదు ఈ మాటలు మాధవ వింటే బాధపడతాడు అని అంటాడు.
తర్వాత ఆదిత్య సత్య ఇద్దరు కూడా సినిమాకి వెళ్లాలి బయటకు వెళ్లాలి అని రెడీ అవుతారు. అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండగా ఇంతలోనే దేవి అక్కడికి వస్తుంది. దేవిని చూసిన ఆనందంలో ఆదిత్య బయటికి వెళ్లాలి అన్న విషయాన్ని మరిచిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సత్య ఎమోషనల్ అవుతుంది. తర్వాత రాధ బట్టలు సర్దుతూ ఉండగా మాధవ రాధ ని సీక్రెట్ గా ఫోటోలు తీస్తూ ఉంటాడు.
అది చూసిన జానకమ్మ మాధవ ఫోన్ లాక్కొని ఇదేం పాడు బుద్ధి రాయడానికి ఆ విధంగా చూడడమేంటి ఆ విధంగా ఫోటోలు తీయడం ఏంటి అంటూ కోపంతో చెంప పగలగొడుతుంది. ఇప్పుడు మాధవ అబద్ధం చెప్పగా జానకమ్మ వినిపించుకోకుండా నిప్పులాంటి రాధా విషయంలో ఇంకొకసారి ఇలా చేసావంటే కొడుకు అని కూడా చూడను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు జానకమ్మ మాధవ సెల్లు అక్కడే విసిరి కొట్టి వెళ్లిపోగా ఆ మాధవ ఆ సెల్లును తీసుకొని ఎవరు ఎన్ని చెప్పినా కూడా రాధ నా ప్రాణం రాధ ని వదులుకునేది లేదు అని అంటాడు.
Read Also : Devatha serial Sep 15 Today Episode : ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ పై కోపంతో రగిలిపోతున్న జానకి..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World