Jabardasth rakesh marriage: టీఆర్పీల కోసం క్రియేట్ చేసిన జోడీ ఇప్పుడు నిజంగా ఒక్కటి కానుంది. అది కూడా పెళ్లి బంధంతో వారు ఏకం కానున్నారు. వాళ్లే జబర్దస్త్ రాకేష్, జోర్దార్ సుజాత. వీరిది జబర్దస్త్ టీం వాళ్లు క్రియేట్ చేసిన ప్రేమ.. అయితే ఆ తర్వాత వారి మధ్య నిజమైన ప్రేమ చిగురించింది. చివరికి అది పెళ్లి వరకు వెళ్లింది. జబర్దస్త్ షోకు హైయెస్ట్ టీఆర్పీ కోసం ఆ షో దర్శక నిర్మాతలు పలు జోడీలను క్రియేట్ చేస్తుంది.
అలా సృష్టించిన వారిలో సుడిగాలి సుధీర- యాంకర్ రష్మీ జోడి చాలా పాపులర్. వీరి మధ్య కెమిస్ట్రీ కరెక్టుగా కుదిరింది. వీరి జోడిని చాలా మంది నిజమే అనుకుంటారు. కానీ వారిది కేవలం స్క్రీన్ పైనే ఏర్పడ్డ బాండింగ్. ఏదో షోలో మాత్రమే వాళ్లు అలా ఇంటిమేట్ గా ప్రవర్తిస్తారు. షో చూసే ప్రేక్షకులు అదే నిజం అని అనుకునేలా ప్రవర్తిస్తుంటారు.
అలాగే ఇమ్మాన్యూయేల్ – వర్ష, నూక రాజు – ఆసియా జోడీలను క్రియేట్ చేశారు. కానీ సుధీర్- రష్మీ జోడీకి వచ్చినట్లుగా మిగతా వారికి క్రేజ్ రాలేదు. అలా క్రియేట్ చేసిన మరో జంటనే రాకేష్ – సుజాతలది. కానీ వీరు ఆ తర్వాత నిజంగా ప్రేమలో పడిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా వారే వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా చేసిన ఓ వీడియోలో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. పెళ్లి ఫిబ్రవరిలో ఉంటుందని వెల్లడించాడు గెటప్ శ్రీను.