Kiraak RP : జబర్దస్త్ షో ద్వారా తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటూ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడ కిరాక్ ఆర్పీ. అయితే గతంలో అతను చాలా సినిమాల్లో కనిపించినప్పటికీ అంతగా ఫేమ్ రాలేదు. కానీ జబర్దస్త్ షో ద్వారా మాత్రం చాలా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ ప్రోగ్రాంను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ.. బిజీగా గడుపుతున్నాడు. తాజాగా కిరాక్ ఆర్పీ నిశ్చితార్థం చేస్కున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. లక్కీ అనే అమ్మాయితో ఆర్పీ ప్రేమలో పడ్డాడట. ఆర్పీకి, లక్కీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట చాలా సార్లు వైరల్ అయ్యాయి. కానీ వారిద్దరూ ఎప్పుడూ దాని గురించి స్పందించలేదు.
సడెన్ గా ఎంగేజ్ మెంట్ ఫొటోలను షేర్ చేసేశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే పార్టీ చేద్దాం పుష్ప అంటూ…. ఓ ప్రోగ్రాం చేశారు. అందులో ఆర్పీ తన లవ్ స్టోరీని చెప్పేశాడు. ఓ పర్ఫామెన్స్ చేస్తూ.. త ప్రేమ కతను వివరించాడు. లక్కీ సెల్ఫీ కోసం తన వద్దకు వచ్చిందని.. వెంటనే ఫోన్ తాను నెంబర్ ఇస్తావా అని అడిగాడట. అలా మొదలైన వారి స్నేహం ప్రేమగా మారిందట. దీంతో అందరి కాళ్లు పట్టుకొని మరీ దీన్ని పెళ్లి వరకు తీసుకొచ్చాడట. ఏది ఏమైనా తానిప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపాడు. ఆ జోడి రొమాంటిక్ పర్ఫామెన్స్ తో అందిరనీ మెప్పించింది.
Read Also : Nagababu : కమెడియన్ ఆర్పీ చేసిన పనికి ఎమోషనల్ అయినా నాగబాబు?