Jabardasth Nokaraju : జబర్దస్త్ నూకరాజు తన ప్రేమను నిరూపించుకోవడానికి సాహసమే చేశాడు. చేతిలో కర్పూరం వెలిగించుకొని అది ఆరిపోయేఅంతవరకు వరకు అలాగే ఉన్నాడు. అలాగే తన ప్రియురాలి మెడలో కాలి కట్టినట్టు తెలుస్తుంది. ఈసారి క్యాష్ షో కి జబర్దస్త్ ఆర్టిస్టులు గెస్ట్ లు గా వచ్చారు. యాంకర్ సుమ తో కలిసికెవ్వు కార్తిక్ -భాను, నూకరాజు -ఆసియా, ప్రవీణ్ -పైమా, పరదేశి- షబీనా సందడి చేశారు. నలుగురు లేడీ కమెడియన్స్ తో సుమ చేసిన స్కిట్ షో లో సందడి చేస్తుంది. ఇక షో స్టార్టింగ్ నుండి పరదేశి వేసిన పంచులు షో కి హైలెట్ గా నిలిచాయి. దానికి తగ్గట్టుగా సుమ కూడా పంచులు బాగానే వేసింది.
ప్రవీణ్ క్యాష్ షో లో ఉన్న నీళ్లు తాగితే కళ్ళలోన పౌరుషం వస్తుంది అనగానే వెంటనే సుమ నీకు లేదా పౌరుషం అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇంద్రజ మరియు మను ల జడ్జిమెంట్ మీకు ఎంకరేజింగ్ గా ఉందా అంటూ కార్తిక్ నీ అడగగానే అవును అని చెబుతాడు. అప్పుడు మిషన్ అరుస్తుంది కార్తీక్ నిజంగా బయట ఎంకరేజ్ చేస్తారు అంటాడు. అప్పుడు పరదేశి మనల్ని ఎంకరేజ్ చేసేంత కామెడీ మనం ఎప్పుడు చేశాము అంటాడు. ఇక ఫైమా ను నీకు ప్రవీణ్ కావాలా? బెస్ట్ కమెడియన్ అవార్డు కావాల అని ప్రశ్నించగా? నాకు ప్రవీణ్ మాత్రమే కావాలి అని సమాధానం చెబుతుంది.
Jabardasth Nokaraju : నీది ఆసియాపై నిజమైన ప్రేమ అయితే.. కర్పూరం చేతిలో వెలిగించుకోమన్న సుమ..
ఈ విధంగా తనకు ప్రవీణ్ పై ఉన్న ప్రేమను బయటపెట్టింది. పరదేశి పెద్ద దురుద్దేషి అవునా కాదా అని షబీనా ను అడగగా లేదు మంచివాడే అని చెబుతుంది. అప్పుడు ఏదైనా మంచి లవ్ సాంగ్ వేయొచ్చు కదా అని పరదేశి అడుగుతాడు. వెంటనే సుమ పరదేశి కి గట్టి కౌంటర్ ఇస్తుంది. ఇక కమెడియన్స్ అందరు కలిసి మొక్కజొన్న పొత్తులు అమ్మే vlog చేస్తారు. ఇక ఈ vlog అందరినీ మైమరిపింప చేస్తుంది.
క్యాష్ ప్రోమోను కట్ చేయడంలో మల్లమాల మార్క్ చూపించింది. నీకు ఆసియాపై నిజమైన ప్రేమ ఉంటే చేతిలో కర్పూరం పెట్టుకొని వెలిగించుకో అని సుమ అనగానే వెంటనే నూకరాజు చేతిలో కర్పూరం పెట్టుకొని వెలిగించుకుంటాడు. చేయి కాలుతున్న అలాగే అది ఆరిపోయే ఇంతవరకు తన చేతిలో ఉంచుకొని ఆసియాపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆసియా వద్దని వారించిన వినకుండా అలానే నూకరాజు తన చేతిలో పట్టుకుంటాడు.
ఆసియాకు తాళికట్టు అని సుమ సరదాగా చెబితే నూకరాజు నిజంగానే తాళి కడతాడు. అంతటితో ప్రోమో ని కట్ చేశారు. ఇక ఇదంతా టిఆర్పి రేటింగ్ కోసం మల్లెమాల సంస్థ వారు ఇలాగా చేశారు అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం నూకరాజు- ఆసియా ప్రేమకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ విధంగా నూకరాజు తన ప్రేమను వ్యక్తపరచడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజమైన ప్రేమ అంటే ఇలాగే ఉండాలి అంటూ నూకరాజు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Viral Video : బైకు లేదు.. బాటిల్ లేదు.. కానీ, బంకులోంచి పెట్రోల్ తీసుకెళ్లాడు.. ఈ కుర్రాడి తెలివి చూడండి..!