Indraja comments: నటి ఇంద్రజ బుల్లితెరపై జడ్జిగా ఆడియన్స్ ను అలరిస్తున్నారు. మొదట్లో గెస్టుగా వచ్చిన ఆమె.. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా ఫుల్ టైమ్ జడ్జిగా మారారు. అయితే సుడిగాలి సుధీర్ ఆ షో నుంచి వైదొలిగిన తర్వాత ఇంద్రజ కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ షోలో రోజూ ప్లేస్ లో జడ్డిగా వ్యవహరిస్తున్నారు. అయితే రోజా ఎప్పుడు వచ్చినా ఆ సీటు నుంచి వెళ్లిపోతానని… అది రోజాదేనని స్పష్టం చేశారు. ఈ విశయం మన అందరికీ తెలిసిందే. అయితే మరోసారి సుడిగాలి సుధీర్ పై పలు ఎమోషనల్ కామెంట్లు చేసింది ఇంద్రజ. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
“ఎక్స్ ట్రా జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంపై కెవ్వు కార్తీక్ ఓ స్కిట్ చేశాడు. కార్తీక్ సుధీర్ లా కళ్ల అద్దాలు పెట్టుకునే టైమ్ లో ఒక్కసారి ఏడ్చేశాను. కన్నీళ్లు ఆపుకోలేకపోవయాలు. సుధీర్ ను నేను సిద్ధూ అని పిలుస్తా. తనని చాలా మిస్ అవుతున్నాను. తను నన్ను ప్రేమగా రాజీ అని పిలుస్తాడు. అతను అమ్మ అని పిలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జబర్దస్త్ నటుడు ప్రవీణ్ కూడా నాకు దేవుడు ఇచ్చిన కొడుకు. చామా మంచోడు. వీరిని వదిలి ఉండడం చాలా కష్టం” అంటూ కామెంట్లు చేసి ఎమోషనల్ అయింది ఇంద్రజ.