Srihari death story: తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప హీరోగా పేరు తెచ్చుకున్న వాళ్లలో శ్రీహరి కూడా ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా అడుగు పెట్టి శభాషఅ అనిపించుకున్నాడు. ఆయన నటన చూసిన ప్రతీ ఒక్కరూ క్లాప్స్ కొట్టాల్సిందే. అయితే ఈయన డిస్కో శాంతిని పెళ్లి చేస్కున్న విషయం అందరికీ తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు. ఇండస్ట్రలోని చాలా మందికి ఈయన అంటే ఇష్టం, గౌరవం. శ్రీహరి చనిపోయి ఏళ్లు గడుస్తుండగా… ప్రస్తుతం ఈయన మరణానికి సంబంధంచిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తన చివరి రోజుల్లో ప్రభుదేవా దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన ఆర్.రాజ్ కుమార్ సినిమా షూటింగ్ లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే డాక్టర్ కు ఫోన్ చేయడంతో ఆయనను చెక్ చేసి నీరసంగా ఉందని సెలైన్ పెట్టారట. కాసేపటికే నర్స్ వచ్చి ఓ ఇంజిక్షన్ చేసిందట. ఆ తర్వాత ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో జాయిన్ చేసి ఐసీయూలో పెట్టారట. డిస్కో శాంతిని కూడా లోపలికి వెళ్లనివ్వకపోవడంతో.. ఆమె చాటుగా వెళ్లి చూసే సరికి బెడ్ అంతా రక్తంతో తడిసిపోయిందట. ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పేసరికే ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారట.
లివర్ సమస్య ఉండగా నేరుగా ఇంజక్షన్ ఇవ్వడం వల్లే అది లివర్ కు గుచ్చుకొని.. చనిపోరంటూ డిస్కో శాంతి ఎమోషనల్ అయ్యారు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీహరి.. అక్టోబర్ 9వ తేదీన మరణించారు. ఈ రోజు సినీ పరిశ్రమ మొత్తం కన్నీరుమున్నీరయ్యారు.