...

Punith Raj Kumar: సడెన్‌గా గుండెపోటు.. పరిస్థితి అత్యంత విషమం

Punith Raj Kumar: కన్నడ ప్రేక్షకులకు ఇది నిజంగా దుర్వార్త. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా గుండెపోటుకు గురై.. విక్రమ్ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయనకు సీరియస్‌గా గుండెపోటు వచ్చిందని, పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సాయంత్రం 3గంటలకు విక్రమ్ హాస్పిటల్ అధికారికంగా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనుంది.

పునీత్ రాజ్ కుమార్ గురించి చెప్పాలంటే.. ఆయన మంచి నటుడే కాదు గాయకుడు కూడా. అలాగే కొన్ని సినిమాలను కూడా ఆయన నిర్మించాడు. ఇటీవల ఆయన నటించిన ‘యువరత్న’ చిత్రం తెలుగులోనూ విడుదలై మంచి విజయం సాధించింది. హీరోగా ఆయన ఇప్పటి వరకు 29 సినిమాలు చేశారు. ప్రస్తుతం ‘జేమ్స్’, ‘ద్విత్వ’ అనే సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.