Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మల్లికా పేపర్ వాడికి అమ్మడం కోసం జానకి రాసుకున్న అసైన్మెంట్ పేపర్లను తీసుకొని వెళ్తుంది.
ఈ రోజు ఎపిసోడ్ లో ఆ పేపర్లు కాస్త జ్ఞానాంబ చేతిలో పడటంతో వెంటనే జ్ఞానాంబ, అఖిల్ ను పిలిచి ఆ పేపర్లు ఏంటో చదవమని చెబుతుంది. అఖిల్ ఆ పేపర్ లు చదువుతూ ఉండగా తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో అవి వేస్ట్ పేపర్లు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మల్లికా అవి వేస్ట్ పేపర్లు అని తెలిసే నేను అతడికి ఇస్తున్నాను అని అనడంతో వెంటనే గోవిందరాజులు మల్లికపై సెటైర్లు వేస్తాడు.
ఇక ఆ తర్వాత మల్లిక స్నానం చేసి వచ్చి అసైన్మెంట్ పేపర్ల కోసం రూమ్ మొత్తం వెతికినా కనిపించకపోవడంతో చికితను అడుగుతుంది.చికితా తెలియదు అని చెబుతూనే మల్లికా అమ్మ ఇందాక వేస్ట్ పేపర్ లు మల్లికా అమ్మేసింది. బహుశా అందులో ఉన్నాయేమో అనడంతో జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మల్లిక వచ్చి జానకిని అడగగా జానకి కోపంతో రగిలిపోతుంది. నీకు బుద్ధుందా నా గదిలోకి ఎందుకు వచ్చావు అంటూ మల్లిక ను నిలదీస్తుంది.
అయితే జానకి అంత గట్టిగ అరుస్తుండడంతో కారణం ఏదో ఉంది అనుకుని మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి గోవిందరాజులు దంపతులు రావడం చూసి జానకి మౌనంగా ఉంటుంది. అప్పుడు మల్లిక తన డ్రామాని మొదలు పెడుతూ తన కొట్టడానికి వచ్చింది పేపర్లు అమ్మినందుకు నాపై అరుస్తుంది అంటూ లేనిపోని మాటలు చెబుతుంది.
పేపర్లు ఏంటో మీరే అడగండి అత్తయ్య గారు అని జ్ఞానాంబ ను రెచ్చగొట్టడంతో అప్పుడు జ్ఞానాంబ ఎప్పుడు నువ్వు ఇంత కోపం చూపించవు అలాంటిది ఎందుకు ఇంతలా కోపం చూపిస్తున్నావు ఆ పేపర్లు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు జానకి అవి స్వీట్ షాప్ కి సంబంధించిన పేపర్లు అని కవర్ చేయగా మధ్యలో మల్లిక మాట్లాడడంతో మళ్ళీకని తిడుతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జ్ఞానాంబ భోజనం రెడీ చేయమని మల్లికకు చెబుతుంది.
అప్పుడు మల్లికా కావాలనే ఒళ్ళు నొప్పులు అని చెప్పి తప్పించుకుంటుంది. అప్పుడు జానకి ఎలా అయినా అసైన్మెంట్ వర్క్ పూర్తి చేసుకోవాలి అనుకుంటూ ఉండగా ఇంతలో జ్ఞానాంబ చెప్పడంతో జానకి టెన్షన్ పడుతూ వంట చేస్తుంది. మధ్య మధ్యలో అసైన్మెంట్ రాసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అందరికీ వడ్డించి వెళ్లి తన గదిలో కూర్చుని రాసుకుంటూ ఉంటుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World